పుట:Prasarapramukulu022372mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ప్రసార ప్రముఖులు.

డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయం ప్రసారాలు మాత్రమే ఈ F. M. కేంద్రాల ద్వారా ప్రసారమవుతున్నాయి. శ్రీ ప్రహరాజు పాండురంగారావు అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేశారు. 1996 ఆగస్టు నుండి ప్రయాగ వేదవతి అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.

వరంగల్ :

కాకతీయ సామ్రాజ్య ప్రాచీన వైభవాలకు నెలవైన ఓరుగల్లు అనబడే వరంగల్లులో F. M. రేడియో కేంద్రం ప్రారంభమైంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కేంద్ర లక్ష్యం. కాకతీయ విశ్వ విద్యాలయానికి ప్రధాన కేంద్రమైన వరంగల్‌లో రేడియో కేంద్రాన్ని అప్పట్లో కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి శ్రీ ఉపేంద్ర 17 ఫిబ్రవరి 1990న ప్రారంభించారు.


P. R. రెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు ఈ కేంద్రం డైరక్టర్లుగా ప్రసారాల ప్రమాణం మెరుగుపరచడానికి విశేష కృషి చేశారు. డా. సి. మధుసూధనరావు 1994 నుండి అసిస్టెంట్ డైరక్టర్‌గా ఈ కేంద్రం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా జిల్లాలలో ఇది నాలుగో కేంద్రం. (అదిలాబాదు, నిజామాబాద్, కొత్తగూడెం, వరంగల్)

రాయలసీమ కేంద్రాలు :

అనంతపురం :

అనంతపురం ఆకాశవాణి F. M. కేంద్రం 1991 మే 29న లాంచనంగా ప్రారంభమైంది. తొలి డైరక్టర్‌గా డా. ఆర్. అనంతపద్మణాభరావు ఆ కేంద్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. పాత్రికేయులు కాశీపతి మాటల్లో చెప్పాలంటే క్షణాక్షణాభివృద్ధికి యత్నించారు. R. V. రమణమూర్తి, కళా కృష్ణమూర్తి, విద్యాలంకార్ తొలినాళ్ళలో కార్యక్రమ నిర్వాహకులు, U. V. S. R. ఆంజనేయులు కేంద్రం ఇన్‌స్టేలేషన్ ఆఫీసర్‌గా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. K. S. శాస్త్రి తొలి స్టేషన్ యింజనీర్. ఈ కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్లుగా ఆరవీటి శ్రీనివాసులు, డా. టి. మాచిరెడ్డి పని చేశారు. అనంతపుర సాంస్కృతిక వికాసానికి ఈ కేంద్రం కృషి చేస్తోంది. కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ