పుట:Prasarapramukulu022372mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

99

కొత్తగూడెం :

భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర F. M. కేంద్రాన్ని కొత్తగూడెంలో ప్రారంభించారు. సింగరేణి కాలరీస్ వారి సౌజన్యంతో భూ సేకరణచేసి రెండేళ్ళు కష్టపడి స్వతంత్ర భవనాలు, స్టూడియోలు రామవరం ప్రాంతంలో నిర్మించారు. కేంద్ర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఢిల్లీనుండి తొలి డైరక్టర్‌గా డా|| ఆర్. అనంతపద్మానాభరావు ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. అప్పట్లో కేంద్ర పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ జలగం వెంగళరావు చొరవతో ఖమ్మం జిల్లా శ్రోతల కలలపంటగా ఈ కేంద్రం ప్రారంభమైంది.

1989 మార్చి 24న కొత్తగూడెం మహిళా కళాశాలలో జరిగిన సభలో వెంగళరావు ఈ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. 6 కిలోవాట్ల ప్రసారశక్తితో ఈ కేంద్రంప్రసారాలు జరుపుతోంది. రాష్ట్ర సమాచార శాఖామంత్రి శ్రీ కారుపాటి వివేకానంద ముఖ్య అతిధిగా విచ్చేశారు. చీఫ్ యింజనీర్లు కె. పి. రామస్వామి, యం. జె. విశ్వనాథం, డిప్యూటీ డైరక్టర్ జనరల్ టి. ఆర్. మాలాకర్ కార్యక్రంలో పాల్గొన్నారు. స్వతంత్ర కేంద్రంగా కేవలం సాయంకాలం మూడున్నర గంటల ప్రసారాలతో తొలుత ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయ ప్రసారాలు కూడా ఆరంభమయ్యాయి. శ్రీ యన్. సి. గోవర్ధన్, A. S. D. శ్రీ యన్. యం. జి. రామకృష్ణ, కబీర్ అహమ్మద్ డైరక్టర్లుగా ఈ కేంద్రం ముందుకు సాగింది. శ్రీ వై రాఘవులు ఈ కేంద్రం బాధ్యతలు 93లో స్వీకరించారు. ఈ కేంద్రం సమర్పించిన 'కిన్నెరసాని' రూపకానికి జాతీయ స్థాయి బహుమతి లభించింది. ఇతర జిలా కేంద్రాలవలె కాక ఇది NON-Local శ్తేషన్. ఇందులో కడప, విశాఖపట్టణం కేంద్రాలవలె సంగీత కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

నిజామాబాద్ :

తెలంగాణా జిల్లాలలో నిజామాబాద్‌లో ప్రసార కేంద్రాన్ని అప్పట్లో కేంద్ర ప్రసార సమాచార శాఖామంత్రి పర్వతనేని ఉపేంద్ర ప్రారంభించారు. 1990 సెప్టెంబరు 9న ఈ కేంద్రం ప్రారంభించారు. శ్రీ యం. నిత్యానందరావు