పుట:Prasarapramukulu022372mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ప్రసార ప్రముఖులు.

దూరదర్శన్ కేంద్రం డైరక్టర్‌గా ఐదేళ్ళపాటు చక్కటి సేవలు అందించారు. బెంగుళూరు దూరదర్శన్ డైరక్టర్‌గా 85-89 మధ్యకాలములో పనిచేశారు. 1995లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు.

భద్రవ్రత :

కృష్ణాజిల్లాకు చెందిన భద్రవ్రత ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి అసిస్టెంట్ డైరక్టర్‌గా రీజనల్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాదులో శిక్షణా బాధ్యతలు నిర్వహించారు. దూరదర్శన్ హైదరాబాదు డైరక్టరుగా 1982-84 సంవత్సరాలలో వ్యవహరించారు. 1984లో రిటైరై రాష్ట్ర ప్రభుత్వం SITE డైరక్టర్‌గా 1 సం. పనిచేశారు.

దూరదర్శన్ వార్తా విభాగం ప్రారంభమైన తర్వాత వార్తలు చదివే వ్యక్తిగా శాంతి స్వరూప్ ఎంపికయ్యారు. తన ప్రత్యేక బాణిలో వార్తలు చదివి తెలుగు ప్రేక్షకులకు పరిచితులయ్యారు. కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసి దూరదర్శన్ ప్రేక్షకుల మన్ననలు పొందిన వ్యక్తులు ఎందరో.

ఓలేటి పార్వతీశం ప్రముఖులు. ఆకాశవాణి కడప కేంద్రంలో 1978లో చేరి దూరదర్శన్‌కు బదలీమీద 81 లో వెళ్ళారు. అక్కడే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 88 లో UPSC ద్వారా ఎంపికయ్యారు. వీరిది పండిత కుటుంబం. వెంకట పార్వతీశ కవులు జంటకవులుగా ప్రసిద్ధులు. వోలేటి పార్వతీశంగారి కుమారులు శశాంక. వారి కుమారులు పార్వతీశం. పాండిత్యంతో పాటు ప్రెజంటేషన్‌లో తన ప్రత్యేకతను పార్వతీశం చాటుకొన్నారు. సాహిత్య కార్యక్రమాల రూపకల్పనలో ఆయన మేటి.

వేదుల కృష్ణశాస్త్రి 1938 మార్చి 15న పండిత కుటుంబంలో జన్మించారు. ప్రముఖ కవి వేదుల సత్యనారాయణశాస్త్రి కుమారులు. ఎం. ఏ. పట్టభద్రులై ఆంగ్లంలో లెక్చరర్‌గా పూనాలోని మిలటరీ శిక్షణా కళాశాలలో పదేళ్ళు పనిచేశారు. 1982 లో UPSC ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టు అయి 1985 ఫిబ్రవరిలో డైరక్టర్‌గా ప్రమోషన్ పొంది ఢిల్లీ వెళ్ళారు. దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో