పుట:Prasarapramukulu022372mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

95

కేంద్రాలలో పనిచేశారు. 1982లో డైరక్టరు అయి, 1987లో అహమ్మదాబాద్ దూరదర్శన్ కేంద్ర డైరక్టర్ అయ్యారు. 1991లో పదవీ విరమణ చేశారు.

దేవళ్ళబాలకృష్ణ 1933 సెప్టెంబర్ 6న జన్మించారు. లాపట్టా పుచ్చుకున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి 1977 జనవరిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా కడప వెళ్ళారు. 1980 జులైలో డైరక్టర్‌గా విశాఖపట్టణం బదిలీఅయ్యారు. గ్యాంగ్‌టాక్, విశాఖపట్టణం కేంద్రాలలో పనిచేసి, దూరదర్శన్‌లో డైరక్టరేట్‌లో కంట్రోలర్ గా వెళ్ళారు. 1991 సెప్టెంబరులో హదరాబాద్ దూరదర్శన్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.

C. రామానుజాచార్యులు 1937 సెప్టంబరులో జన్మించారు. ఆడియన్స్ రీసెర్చి ఆఫీసర్ గా చేరి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా UPSC ద్వారా ఎంపికయ్యారు. వివిధ కేంద్రాలలో పనిచేసి 1995 సెప్టెంబరులో గుల్బర్గా దూరదర్శన్ కేంద్రంలో డైరక్టర్‌గా రిటైరయ్యారు. టి. వి రాఘవాచార్యులు దూరదర్శన్‌లో వివిధ కేంద్రాలలో పనిచేసి భోపాల్ దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. R. R. K. శ్రీ డిప్యూటీ డైరక్టర్‌గా దూరదర్శన్‌లో పనిచేస్తున్నారు.

R. వెంకటేశ్వర్లు మరో ఉన్నతాదికారి. 1954 జులై 1 జన్మించిన వెంకటేశ్వర్లు ఫీల్డ్‌పబ్లిసిటీ ఆఫీసర్‌గా గుంటూరులో ఒక దశాబ్ది పనిచేశారు. అంతకు ముందు ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాద్‌లో పనిచేశారు. 1988లో UPSC ద్వారా స్టేష డైరక్టర్‌గా ఎంపికయైన యువకుల్లో వెంకటేశ్వర్లు ఒకరు. మొట్టమొదటిసారి తిరునల్వేలి స్టేషన్‌డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుండి వరంగల్ స్థానిక రేడియో డైరక్టర్‌గా చక్కటి సేవలు అందించారు. 1994 నుండి దూరదర్శన్ హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1996లో కంట్రోలర్‌గా హైదరాబాదు దూరదర్శన్ కేంద్ర పదవీ బాధ్యతలు స్వీకరించారు.

దూరదర్శన్‌లో పనిచేసిన మరో ఉన్నతాధికారి సి. గురునాద్. 1937 మే 28న జన్మించిన గురునాద్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరారు. 1985 లో UPSC ద్వారా స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టు అయ్యారు. బొంబాయి