పుట:Prasarapramukulu022372mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ప్రసార ప్రముఖులు.

దూరదర్శన్ కేంద్రం

హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం తెలుగువారి ఆశాజ్యోతిగా SITE కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలినాళ్ళలో ఆడియన్స్ రిసెర్చి ఆఫీసర్ శ్రీ బి. యస్. యన్. రావు ఈ కార్యక్రమంలో పనిచేశారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో కొంత భాగానికి ఈ ప్రసారాలు పరిమితం. Sattelite Instruction Television Experiment పేర ఈ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాఠశాల విద్యార్థుల కుద్దేశించిన ఈ ప్రసారాలు కొంతవరకు ప్రయోజనాన్ని సాధించాయి.

దూరదర్శన్ తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడంతో తెలుగువారి సాంస్కృతిక వికాసానికి మరింత అవకాశం లభించింది. హైదరాబాదులోని రాజభవన్ రోడ్‌లో అద్దె బంగళాలో ఈ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్ళలో నండూరి విఠల్ డైరక్టర్‌గా కార్యక్రమాల రూపకల్పన చేశారు. నండూరి విఠల్ అద్భుతగాత్ర గాంభీర్యం గలవ్యక్తి. నాటకాలలో చక్కటి అనుభవం గల శ్రావ్య, మైనకంఠం. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా జీవనం ప్రారంభించి స్టేషన్ డైరక్టర్‌గా అనారోగ్య కారాణాలతో 1986 ప్రాంతాలలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అస్వస్థులుగా వుండి 93 ప్రాంతాలలో కాలం చేశారు. ప్రస్తుతం హైదరాబాదు కేంద్రం డైరెక్టర్.

వేదగిరి శర్మ, శ్రీ గోపాల్ దూరదర్శన్‌లో కార్యక్రమ నిర్వహకులుగా పనిచేశారు. ఇద్దరూ అకాలమరణం చెందడం విధి విలాసం. వడ్డాది అప్పారావు దూరదర్శన్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. 1940 జులై 14న జన్మించిన అప్పారావు దూరదర్శన్‌లో ప్రొడ్యూసర్‌గా 1963 లో చేరారు. ఆ తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ డైరక్టర్, డైరక్టరు హోదాలు నిర్వహించారు. దూరదర్శన్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో పనిచేశారు.

దూరదర్శన్ డైరక్టర్ జనరల్ కార్యాలయంలో పని చేసిన ఆంధ్రులలో దేవళ్ళ బాలకృష్ణ, హెచ్. యన్. పాత్రో, వి. వి. కృష్ణశాస్త్రి, విమలామిట్టల్, వి. అప్పారావు ప్రముఖులు.

హెచ్. యన్. పాత్రో ప్రవాసాంధ్రులు. 1933 జనవరి 13 న జన్మించిన పాత్రో వివిధ హోదాలలో ఆకాశవాణిలో హైదరాబాదు, జయపూర్ (ఒరిస్సా)