పుట:Prasarapramukulu022372mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

93

ప్రాంతీయ వార్తలు కడప కేంద్రం రిలే చేస్తుంది. ఉదయం 6-45 ని. లకు విజయవాడ కేంద్రం నుండి వచ్చే ప్రాంతీయ వార్తలు, హైదరాబాదు, కడప, విశాఖపట్టణం కేంద్రాలు రిలే చేస్తాయి. మ. 1-20 ని. లకు విజయవాడ ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణం రిలే చేస్తుంది.

హైదరాబాదు వార్తా విభాగం బుధ, శనివారాలలో ఆంధ్ర దేశంలో జరిగే వార్తలతో "రేడియో న్యూస్ రీల్‌" రాత్రి 7-45 ని. లకు ప్రసారం చేస్తుంది. అన్ని కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ శాసనసభ సమీక్ష పాత్రికేయులు చేస్తారు. అన్ని కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే వార్తా వ్యాఖ్య పేర తాజా విషయాలపై వ్యాఖ్యలు ప్రసారం చేస్తూంది.

ఎన్నికల సమయాలలో రాత్రింబగళ్ళు ప్రత్యేక వార్తాప్రసారాలు చేయడం ఆనవాయితీ. రేడియో మాద్యమం త్వరగా వార్తలు చేరవేయడంలో తన ప్రత్యేకతను చాటుతుంది. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N. T. రామారావు మరణ వార్తను ఉ. 6 గం. లకు ఢిల్లీ కేంద్రం నుండి వచ్చే ఆంగ్లవార్తల్లో ప్రసారం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోవడంతో పత్రికలు ఆ వార్తను ప్రచురించలేకపోయాయి. జాతికి ఆ వార్తను తొలిసారిగా రేడియో త్వరితంగా అందించగలిగింది.

1995 మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 98 లక్షల రేడియో సెట్టులు వున్నట్లు ఒక అంచనా.