పుట:Prasarapramukulu022372mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ప్రసార ప్రముఖులు.

గాత్ర గాంభీర్యంతో శ్రోతల్ని అలరించేవారు. పదవీ విరమణ తర్వాత 'సమయం' పత్రికా సంపాదకులుగా పనిచేసి హైదరాబాదులో మృతి చెందారు, గోళ్ళమూడి నళినీమోహన్ హైదరాబాదులో వార్తలు చదివేవారు. వీరు తర్వాత ఢిల్లీ జనరల్ న్యూస్ రూమ్‌లో ఎడిటర్‌గా పదవీ విరమణ చేశారు.

న్యూస్ రూంలో అసిస్టెంట్ ఎడిటర్లుగా ఎందరో పని చేశారు. వారిలో నర్రావూరు సుబ్బారావు, మల్లాది రామారావు, J. B. రాజు, R. రామచంద్రరావు, కొత్తపల్లి సుబ్రమణ్యం, R. V. R. కృష్ణారావు, ఆకిరి రామకృష్ణారావు, సుజాత, ఆలీ, అశోక్‌రావు మల్లాది రామారావు హైదరాబాదు నుండి ఢిల్లీ కి రిపోర్టరుగా బదిలీ అయ్యారు. 1994లో ఉత్తమ రిపోర్టర్‌గా జాతీయస్థాయిలో బహుమతి పొందారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆంగ్ల దినపత్రికలో రిపోర్టరుగా చేరారు.

వార్తా విభాగంలో వార్తలు చదివే వారిలో డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న ప్రముఖులు. వీరుగాక క్యాజువల్‌గా వార్తలు చదవడానికి వచ్చిన వారిలో పత్రికా సంపాదకులు పొత్తుర్రి వెంకటేశ్వరరావు, సురమౌళి, గుడిపూడి శ్రీహరి. పార్వతీ ప్రసాద్ ప్రముఖులు. దివి వెంకట్రామయ్య కథా రచయితగా మంచిపేరు సంపాదించారు. చక్కటి కంఠం గల వీరు సమర్దులైన వ్యక్తులు.

హైదరాబాదు కేంద్రం నుండి ఉర్దూ వార్తలు కూడా ప్రసారమవుతాయి. న్యూస్ ఎడిటర్ ఆంగ్లలో జనరల్ పూల్ కాపీ తయారు చేస్తారు. దానిని తెలుగు ఉర్దూలలో తర్జుమా చేసుకొని ఆయా విభాగాల న్యూస్ రీడర్లు చదువుదురు. ప్రాంతీయ వార్తలు ఉర్దూలో చదవడంలో వసీం అక్తర్ చాలా ప్రసిద్ధులు. ఆయన పదవీ విరమణ చేశారు. ఉర్దూ వార్తలు సా 5- 50 ని. లకు హైదరాబాదు నుండి ప్రసారమవుతాయి. కడప కేంద్రం కూడా రిలే చేస్తుంది. ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాదు నుండి సా, 6-15 ని. లకు ప్రసారమై అన్ని ఆంధ్ర కేంద్రాలు రిలే చేస్తాయి. అలానే మధ్యాహ్నం 1-10 ని. లకు హైదరాబాదు