పుట:Pranayamamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమును సహిత కుంభకము అందురు. ఇవి రెండును లేని దానిని కేవలకుంభకము అందురు. సహితకుంభకములో పూర్ణమైన విజయమును పొందిన పిమ్మట దీనిని అభ్యసించవలెను. ఇది చేయువానియందు స్థలకాల సంఖ్యా నియమములు లేకుండ అనేక స్థలములలో పూరకరేచకములు కూడ లేకుండ శ్వాసనిలచిపోవును. అట్టిస్థితినే కేవలకుంభకము అందురు. ఇదే నాల్గవ మెట్టు. ఇందువలన అనేక విధములగు మహిమలు లభించును. దీనిని గురించి వశిష్ఠ సంహితలో, "శ్వాసోచ్చ్వాసలు రెండును లేకుండ ఏమాత్రము శ్రమయులేకుండ పోవుటనే కేవలకుంభకము అందురు." అని గలదు. ఈప్రాణాయామములో రేచక పూరకము లేమియు లేకుండ ఆకస్మికముగ శ్వాస ఆగిపోవును. సాధకుడు తన యిచ్ఛ వచ్చినంతసేపటివరకు శ్వాసను ఆపి వేయగలిగియుండును. రాజయోగ స్థితినిపొందును. కుండలినిని గురించిన జ్ఞానముకలుగును. కుండలినిమేల్కొనును. సుషుమ్నా మార్గమున గల అడ్డంకులన్నియు లేకుండపోవును. హఠయోగము సిద్ధించును. దీనిని రోజుకు మూడుమారులు చేయవచ్చును. ఇది తెలిసినవాడే నిజమైనయోగి. ఈ కుంభకము సిద్ధించినవానికి పొందరాని దీ ముల్లోకములం దేదియు లేదు. ఈ కుంభకము సమస్త వ్యాధులనుపోగొట్టి ఆయువును పెంచును.

ప్రాణశక్తిచే రోగ నివారణ

ప్రాణాయామమును చేయువారు తమ ప్రాణశక్తివలన వ్యాధులను నివారించగలరు. ఆ విధముగ కోల్పోయిన ప్రాణశక్తిని కుంభకముచేసి తిరుగ సంపాదించుకొనగలరు. ఈ విధముగ ప్రాణశక్తిని వినియోగించుటవల్ల, నీ యందలి ప్రాణశక్తి