పుట:Pranayamamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకొకరకపు క్రమశ్వాసాభ్యాసము కలదు. దానిని యీ విధముగ చేయుదురు. 4 'ఓం' లను జపించునంతసేపటి వరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినిపీల్చుము. 8 'ఓం' లను జపించునంతసేపటివరకు ఆ గాలిని లోపల బంధించుము. తరువాత మరల 4 'ఓం' లనుజపించునంతసేపటివరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినివిడవుము. తరువాత 8 'ఓం' లను లెక్క్ంచునంతసేపటివరకు గాలిని పీల్చకుండ బాహ్యకుంభకము చేయుము.

నీ శక్త్యనుసారము పై ప్రకారము కొన్ని మారులు చేయుము. క్రమక్రమముగ శ్వాసోచ్ఛ్వాసల సమయమును 8 'ఓం' లను లెక్కించునంత సేపటివరకును, కుంభకమును 16'ఓం' లను లెక్కించునంత సేపటివరకును అధికము చేసికొనుచూ రమ్ము. ఇటుల వృద్ధిచేయుటలో ఏవిధమగు శ్రమయు వుండకుండు లాగున చూచుకొనుము. ఇందుచే ఏ మాత్రము బాధ వుండరాదు. దీర్ఘ శ్వాసకంటె, క్రమశ్వాసయే యెక్కువ విలువగల దనెడి విషయమును జ్ఞప్తియం, దుంచుకొనుము. పట్టుదల శ్రద్ధలతో చేయుము.

సూర్య భేద

పద్మాసనములో గాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కండ్లు మూయుము. కుడిచేతి వుంగరపు, చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. నీవు పీల్చగలిగినంత సేపు ఏ విధమగు శబ్దమును చేయకుండ నెమ్మదిగా కుడి ముక్కుతో గాలిని పీల్చుము. తరువాత కుడిముక్కును కుడి బొటన వ్రేలితో మూసి గడ్డమును రొమ్మునకు ఆనించి (జాలంధర బంధము) కుంభకము చేయుము. ఈ కుంభకమును శరీర