పుట:Pranayamamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాయంత్రము ఇంకొక చుట్టునూ చేయుము. మూడవ వారములో ఉదయము రెండు, సాయంత్రము రెండు చుట్లను చేయుము. ఈ రీతిని క్రమక్రమముగ వృద్ధిచేసికొనుచూ ప్రతిపూట 120 రేచకములను చేయగలుగునంతవరకు పెంచుచూ రమ్ము.

ఇది ముక్కు, శ్వాసావయవములను పరిశుభ్రపరచును. సూక్ష్మ శ్వాసనాళములందలి స్నాయువుల ఈడ్పును పోగొట్టును. క్రమక్రమముగ కొంతకాలమునకు ఉబ్బసము నివారణమగును. ఊపిరితిత్తులకు వలసినంత ప్రాణవాయువు లభించును. ఇందువలన క్షయవ్యాధిబీజములు జన్మింపవు. క్షయవ్యాధిని కూడ యీ అభ్యాసము నివారించగలదు. ఊపిరితిత్తులు వృద్ధియగును. కర్బన ద్వ్యమ్లజనిదము బయటకు నెట్టివేయబడును. రక్తములోగల అన్నివిధములగు అపరిశుద్ధతలు పోవును. జీవాణువులు, ధాతువులు ఎక్కువగా ప్రాణవాయువును తీసికొనును. సాధకునకు చక్కని ఆరోగ్యము లభించును. హృదయము చక్కగా పనిచేయును. రక్తప్రసరణావయవములు, శ్వాసావయవములు తమ పనులను చక్కగా నిర్వర్తించుకొనును.

బాహ్య కుంభకము

8 మార్లు 'ఓం'ను లెక్కించునంతవరకు ఎడమముక్కుతో గాలిని పీల్చుము. గాలిని లోపల ఆపుజేయకుండా వెంటనే 6 'ఓం' లను లెక్కించునంతసేపటివరకు కుడిముక్కుగుండా బయటకు విడచుము. 12 'ఓం'లను లెక్కించునంతవరకు గాలిని పీల్చకుండఆగుము. ఆపైన కుడిముక్కుతో పైరీతిని గాలిని పీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడచి, పై పరిమితి ప్రకారము