పుట:Pranayamamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారము ఒక్కొక్క చుట్టును పెంచుకొనుచు వచ్చుచు 3, 4 చుట్లు వరకు చేయుము. ఇది ఒక విధమగు ప్రాణాయామమే.

కపాలభాతి

'కపాలభాతి' అన పుఱ్ఱెను ప్రకాశింప జేయుట అన, యీ క్రియ వల్ల కపాలము పరిశుద్ధ మగును. దీనిని షట్కర్మలలో ఒకటిగా లెక్కించెదరు.

పద్మాసనములో కూర్చొనుము. మోకాళ్ళపై చేతులను పెట్టుము, కండ్లు మూయుము. త్వరత్వరగ పూరక రేచకములను చేయుము. ఇందువల్ల చెమట పోయును. ఇది ఒక చక్కని వ్యాయామము. ఈ అభ్యాసము బాగా అలవాటైనవారు భస్త్రిక ప్రాణాయామమును సులభముగ చేయగలరు. ఈ ప్రాణాయామములో కుంభకము లేదు. దీనియందు రేచకము ప్రధానము, పూరకము నెమ్మదిగను దీర్ఘమైనదిగను వుండును. రేచకమును అతి త్వరగా బలవంతముగ చేయవలెను. పూరకము చేయునపుడు పొట్ట యందలి స్నాయువులను సడలించి వుంచుము. కొందరు వెన్నుముకను, మెడను వంపుగా వుంచెదరు. అటుల వుంచరాదు. మెడ, మొండెము నిలువుగా వంపు లేకుండ వుండవలెను. భస్త్రికలో వలె ఆకస్మికముగ పూరకము వెంటనే రేచకము జరుగును. మొట్టమొదటిలో రేచకము ఒక సెకండు సేపు చేయుము. క్రమక్రమముగ సెకండుకు రెండు రేచకములు చేయగలుగు లాగున అలవరచు కొనుము. మొట్టమొదటిలో ఉదయమున 10 రేచకములు గల ఒక చుట్టును మాత్రము చేయుము. రెండవ వారములో, ఉదయము పై పరిమితి గల ఒక చుట్టు