పుట:Pranayamamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాయత్రీ మంత్ర శిరస్సును గూడ, జివర చెప్పవలయును.

ఓం అపోజ్యో తీరసో బ్రహ్మ భూర్భువస్సువరోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో, ఇది శిరస్సు, యాజ్ఞ వల్కయోగి దీనినిగురించి యీ రీతిని చెప్పెను:-

ఉచ్చ్వాస నిశ్వాసలను రెండింటిని నిరోధించి మాత్రా పరిమితి గల 'ఓం'కార స్మరణతో శ్వాసను నియమించుటను అభ్యసించవలెను. 'ఓం'కారము పరమ హంస సన్యాసులకు మాత్రమే నిర్ణయింపబడి యున్నది. స్మృతులతో ఉచ్చ్వాస నిశ్వాసాదులను బొడ్డు, హృదయము, నుదుటిపై ధారణ చేయుచూ, ఆ స్థలములందు వరుసగ బ్రహ్మ, విష్ణు, శివులను ధ్యానించుచూ ప్రాణాయామము చేయవచ్చునని కలదు. ఇది సాధారణ జనులకు కాని పరమ హంస సన్యాసులకు బ్రహ్మ ధ్యానము ఒక్కటే నిర్ణయింపబడినది. దీనినే శ్రుతులలో "ఆత్మ సంయమము గల సాధకుడు పరబ్రహ్మపై ఓం కార జపముచే ధారణ చేయవలెను." అని గలదు.

1 వ అభ్యాసము

పద్మాసనములో కూర్చొనుము. కండ్లు మూయుము. రెండు కనుబొమల (త్రికుటి) మధ్య ధారణ చేయుము. కుడి ముక్కును కుడిబొటనవ్రేలితో మూయుము. నీకు సులభముగను శ్రమలేకుండగను వుండునంత సేపటివరకు నెమ్మదినెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. ఆ పిమ్మట చాల నెమ్మదిగా అదే ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మార్లు చేయుము. ఇది ఒక మెట్టు లేక చుట్టు.