పుట:Pranayamamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్వాసావరోధము

ఆసన సిద్ధిని పొందుట లేక శరీరమును వశపరుచుకొనుట అనునది మొట్టమొదటి ముఖ్యవిషయము. ఆ తరువాత ప్రాణాయామమును అభ్యసించవలెను. ప్రాణాయామ సాధనలో విజయము పొంద గోరుచో సరియగు ఆసనమున కూర్చొన గలుగుట అవశ్యకము. సులభముగను సుఖముగను కూర్చొను ఏ పద్ధతినైన ఆసనము అనవచ్చును. ఇట్టి వాటిలో చాలసేపటి వరకు ఏవిధమగు బాధయు లేకుండ కూర్చొన గలుగు ఆసనము శ్రేష్ఠమైనది. ఱొమ్ము, మెడ, తల, ఇవి నిలువుగ వంకర లేకుండ గీసిన గీతవలె వుండవలెను. శరీరము ఏమాత్రము వెనుక ముందులకు గాని, ప్రక్కలకు గాని వాలి వుండరాదు. వంగి కూర్చొనరాదు. ముడుచుకొని వుండరాదు. ఈ విధముగ కూర్చొనుటను అనేకమారులు అభ్యసించినచో ఆసన సిద్ధి వచ్చును. బొద్దు(లావు)గా వున్నవారికి పద్మాసనము కష్టముగా తోచవచ్చును. అట్టివారు 'సుఖ' లేక 'సిద్ధాసనము'లో కూర్చొనవచ్చును. ఆసన సిద్ధి లభించునంతవరకు ప్రాణాయామము చేయకుండ వుండనక్కరలేదు. ఆసనము, ప్రాణాయామము రెండింటిని ఒక దానితో పాటు మరొకదానిని అభ్యసించవచ్చును. కొంతకాలమునకు రెండింటియందును నీకు పూర్ణత్వము ప్రాప్తించును. కుర్చీలో నిలువుగా కూర్చొనికూడ ప్రాణాయామమును చేయవచ్చును.

భగవద్గీతలో ఈ ఆసనమును గురించి చక్కగా వివరింపబడినది:- పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశములో, మిక్కిలి ఎత్తును మిక్కిలి పల్లమునుగాని పీటమీద దర్భాసనమువేసి, దానిపైన పులి లేక జింక చర్మమును, దానిపైన గుడ్డనువేసి, దానిపై