పుట:Pranayamamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడిగా చూచినచో ప్రాణము వ్యష్టి రూపము గలది. జగత్ప్రాణమును హిరణ్యగర్భ మందురు. దానినే సమష్టి ప్రాణమని కూడ చెప్పెదరు. ఒకే నిప్పుపుల్లను వ్యష్టి యందురు; నిప్పుపెట్టెను అంతనూ సమష్టియందురు. ఇదేరీతిని ఒక మామిడికాయను వ్యష్టి యనియు, మామిడికాపును అంతటిని సమిష్టియనియు అందురు. శరీరమునకు గల శక్తియే ప్రాణము. ఊపిరితిత్తులయొక్క చలనమును లేక శ్వాస ప్రశ్వాసేంద్రియములను వశపరచుకొనుటవల్ల, లోపల ప్రసరించుచున్న ప్రాణ శక్తి వశపడును. ప్రాణము వశపడుటచే మనస్సులోబడును. ప్రాణము మనస్సులు, పక్షి, తాడులాటివి. త్రాటితో కట్టి వేయబడిన పక్షి తప్పించుకుపోవలెనని యిటు అటు ఎగిరి చివరకు తప్పనిసరిగా, తాను కట్టివేయబడిన చోటునకే తిరిగివచ్చి ఏవిధముగా విశ్రమించునో, అదేవిధముగ ఈమనస్సు అనెడి పక్షి అనేకవిధములగు యింద్రియవిషయములకై పరుగులిడి, ఎందునను సుఖము గానక, చివరకు రాత్రిసమయమున తన విశ్రాంతి స్థానమగు ప్రాణమును చేరుచున్నది.

___________

ప్రాణాయామము

(గీత ప్రకారము)

   అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపాన: తథాపరే
   ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామ పరాయణా:
                      (గీత 4 అ 29 శ్లో)

ప్రాణాయామము ఒక పవిత్రమైన యజ్ఞము. కొందరు పూరక కుంభకమును (ప్రాణవాయువుతో నింపుట), కొందరు రేచక కుంభకమును (గాలిని పూర్తిగా బయటకు విడచి కుం