పుట:Pranayamamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలచులాగున అభ్యసించుము. ఇట్టివానికి యోగదృష్టి, దివ్యదృష్టి, ఆకాశగమనము, కోరిన రూపమును పొందగలుగుట, ఇచ్ఛవచ్చిన భాషలో మాట్లాడగలుగుట, కనిపించకుండ మాయముకాగలుగుట, ఇనుమును బంగారముగ మార్చగలుగుట - మొదలగు ఎన్నోశక్తులు లభించగలవు

యోగమును చక్కగాఅభ్యసించువాడు, గాలిలో ఎగుర గలడు. కాని యోగసిద్ధికి, ఈ మహిమలుఅన్నియు విఘ్న కారులని తెలివిగలవాడు తలచవలెను. కావున వీటికి లోబడరాదు. ఈ శక్తులను ఎవరిపైనను ప్రయోగించరాదు. ఈ మహిమలు లేని సామాన్యమానవునివలె సంచరింపవలెను. శిష్యులు తమ వాంఛలను నెరవేర్చుకొనుటకై, గురువుయొక్క మహిమలను ప్రదర్శింపవలసినదిగా కోరుదురు. ఇందుకు సమ్మతించినవాడు, యోగసాధన చేయుటకు అవకాశము లేక వదలివేయవలసి వచ్చును. కావున, తాను బాగుపడవలెనని తలచువాడు రాత్రింబవళ్ళు యోగాభ్యాసనమును మాత్రమే చేయుచుండ వలెను. ఎడతెగకుండ యోగసాధనము చేయుట వలన త్వరలోనే ఘటావస్థ సిద్ధించును. నిరుపయోగకరముగ, యీప్రాపంచిక వ్యామోహములలో మునిగియుండు వారి సాంగత్యము వలన, ఏవిధమగు ప్రయోజనమును లేదు. దుస్సాంగత్యమును వదలి యోగసాధనను పట్టుదలతో చేసి సుఖించుము.

పరిచయావస్థ

ఇటుల ఎడతెగకుండ యోగసాధన చేయుటవలన పరిచయావస్థ(3 వ మెట్టు) వచ్చును. ఈస్థితిలో ఎడతెగని సాధనచే కుండలిని మేల్కొని, సుషుమ్నలో ప్రవేశించును. చిత్తము