పుట:Pranayamamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రమే తిని జీవించును. ఇతడు తన శిష్యులను అందరిని ఈ రొట్టెనే తినవలసినదిగా చెప్పును. అక్బరుపాదుషా బార్లీ ఆహారమునే పుచ్చుకొనెడివాడట.

నీవు-పాలు, గోధుమ, బియ్యము, బార్లీ, రొట్టె, ఆవు పాలు, నెయ్యి, పంచదార, వెన్న, పటికబెల్లము, తేనె, శొంఠి, పచ్చికాయగూరలు, పెసలు, బంగాళదుంప, సర్జరసము, ఖర్జూరము, పులగములను తినవచ్చును. కుంభక సమయమును అధికము చేయుట కొరకు, ఆహారపదార్థములయొక్క పరిమాణమును తగ్గించవలెను. ప్రారంభదశలో చాల ఎక్కువగ ఆహార పరిమాణమును తగ్గించరాదు. సూర్యనాడియందు గాలి ప్రవహించునపుడు ఆహారము తీసికొనుము. పనస, దోస, వంకాయ, అరటిఊచ, సొర, బెండకాయలను కూడ తిన వచ్చును.

తినరానివి

బాగా వేయించిన కూరలు, కారపు కూరలు, పచ్చళ్లు, మాంసము, చేపలు, మెరపకాయలు, పుల్లగా వుండు వస్తువులు, చింతపండు, ఆవాలు, అన్నిరకముల నూనెలు, ఇంగువ, ఉప్పు, వుల్లిపాయ, వెల్లుల్లి, మినపప్పు, చేదువస్తువులు, ఎండిన లేక ఆరిపోయిన పదార్థములు, బెల్లము, ద్రాక్షసారాయము, మద్యసారము, పులి పెరుగు, పాచిపోయిన ఆహార పదార్థములు, ఆమ్లములు, వగరు వస్తువులు, ఘాటుగావుండు పదార్థము, బాగా వేగిన వస్తువులు, సులభముగ జీర్ణము కాని కూరలు, పక్వముకాని లేక మిగుల పండిన ఫలములు, గుమ్మడి కాయలు మొదలగు వానిని తినరాదు.