పుట:Pranayamamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోషక పదార్థములను అన్నిటినీ అది వక్కటే యివ్వగలిగి వున్నది. అంతేగాక, అది ప్రేవులలో చాల కొద్ది మలము మాత్రమే వుండులాగున చేయగలదు. ఇది యోగులకు, ప్రాణాయామసాధకులకు ఆదర్శకరమైన ఆహారము.

ఫలములు

ఫలాహారము శరీర ఆరోగ్యమును బాగుచేయును. యోగులకు ఇది చక్కని ఆహారము. ఇంతేగాక యిది ప్రకృతి సిద్ధమైన ఆహారముకూడను. ఇవి చాల బలమును యిచ్చును. అరటిపళ్ళు, ద్రాక్ష, తీపినారింజ, సీమరేగు, దానిమ్మ, మామిడి, సపోటా, ఖర్జూరములు శ్రేష్ఠమైనవి. నిమ్మకాయలు రక్తమునకు పుష్టినియిచ్చును. ఫలరసమునందు 'సీ' విటమినువుండును. సపోటాకాయలు, పరిశుద్ధరక్తమును వృద్ధిచేయును. మామిడి పళ్ళు, పాలు ఆరోగ్యకారులు. పాలు, మామిడిపళ్ళు మాత్రమే తిని జీవించవచ్చును. దానిమ్మగింజల రసము శరీరమునకు చల్లదనమును యిచ్చుటేగాక బలవర్థకము కూడను. అరటిపళ్ళు కూడ ప్రాణపోషకమైనవిన్నీ, బలవర్థకమైనవిన్నీ అయివున్నవి. ఫలాహారము మనస్సునకు ఏకాగ్రతను కలిగించును.

తినదగినవి

బార్లీ, గోధుమ, నెయ్యి, పాలు, బాదం కాయలు, ఆయువును వృద్ధిచేసి, బలమును, శక్తిని కలిగించును. యోగులకు, సాధకులకు బార్లీ చక్కని ఆహారము. శరీరమునకు చల్లదనమునుకూడ యిచ్చును. "ఏక్‌సంత్ కా అనుభవ్" అనే గ్రంథమును రచించిన శ్రీనారాయణస్వామి బార్లీ రొట్టెను