పుట:Pranayamamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలము

ప్రాణాయా మాభ్యాసమును వసంతఋతువు(చైత్ర) వైశాఖములు, లేక శరదృతువు (ఆశ్వయుజ కార్తీకములు) లో గాని ప్రారంభించవలెను. ఏలనన, ఈ ఋతువులలో ఏ విధమగు శ్రమము లేకుండా జయములభించును. ఎండాకాలములో మధ్యాహ్న సాయంకాలములందు ప్రాణాయామము చేయరాదు. ఉదయ సమయమున చల్లనిగాలి వీచునప్పుడు చేయవలెను.

అధికారి

ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియదమనము, శాస్త్రములందు గురు వాక్యములందును నమ్మకముగలవాడు. ఆస్తికుడు (దేవునియందు నమ్మకముకలవాడు), మితముగ భుజించువాడు, మితముగ నిద్రించువాడు, జననమరణ బంధమునుండి విముక్తి పొందగోరువాడు, ఇట్టి లక్షణములు గలవాడు యోగసాధనకు తగినవాడు. ఇట్టివాడు ప్రాణాయామమేకాదు, తదితర యోగ సాధనలలోకూడ సులభముగ జయమునుపొందును. ప్రాణాయామమును శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, జాగ్రత్త, విశ్వాసములు గల వాడై చేయవలెను.

ఇంద్రియ సౌఖ్యములకు లోబడినవారు, గర్వపోతులు, మర్యాదలేనివారు, అబద్దీకులు, కుయుక్తులుపన్నువారు, వంచకులు, విశ్వాసఘాతుకులు, సాధువులు, సన్యాసులు, గురువులు, యోగీశ్వరులను అగౌరవముగచూచువారు, వ్యర్థముగ తర్కించువారు, తాగుబోతు, ఎవరిని నమ్మనివారు, ప్రాపంచిక