పుట:Pranayamamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగి ధైర్యము, బలము, పుష్టి, ఆనందము, తేజస్సులతో కనిపించును. యోగి యగువాడు సూర్యనాడి(కుడిముక్కునందు గాలి సంచరించునప్పుడు) సంచరించునప్పుడు ఆహారమును తీసికొనవలెను. అటుల చేయుటచే సూర్యనాడి ఉష్ణకారి గాన త్వరగ జీర్ణము అగును. ఆకలితో వున్నప్పుడుగాని, అన్నము తినిన వెంటనేగాని ప్రాణాయామము చేయరాదు. క్రమక్రమముగ 3 ఘటికల (ఒకటిన్నర గంటల) వరకు గాలిని లోపల ఆపుజేయగలుగునంతవరకు అభ్యసించవలెను. ఇటుల చేయగలిగినచో అనేకములగు సిద్ధులు లభించును. ఈ రీతిని చాల సేపటివరకు గాలిని కుంభించుటను అభ్యసించదలచినవాడు ఈ విద్యలో ఉత్తీర్ణుడైన గురువువద్ద వుండి అభ్యసించవలెను. మూడు నిముషముల వరకు ప్రతివాడు సులభముగ గాలిని ఆపవచ్చును. ఈ మాత్రము అభ్యసించినచో, ఇది నాడీశుద్ధిని, మనస్సు నిలుకడను, ఆరోగ్యమును లభించులాగున చేయగలదు.

స్థలము

నది, చెరువు, సముద్రము ఒడ్డునగాని, చక్కటి జల ప్రవాహము, చెట్ల సమూహముగల కొండపైనగాని ప్రశాంతము, ఏకాంతము గలిగి, ఆహ్లాదకరముగ నుండు ఒకస్థలమును నిర్ణయించుకొనుము. పాలు, ఆహారపదార్థములు సులభముగ లభించెడి స్థలముగ వుండవలెను.

ఒక చిన్న కుటీరమును వేసికొనుము. ఒక ఆవరణను కూడ ఏర్పాటు చేసికొనుము. దొడ్డిమూల ఒక నూతినిత్రవ్వు