పుట:Pranayamamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క పటమును పెట్టుకొనుము. ప్రాణాయామము లేక ధ్యానమును ప్రారంభించ బోవుటకు ముందుగా ఆపటమును శారీరకముగను మానసికముగను పూజించుము. ఆ గదిలో అగరు వత్తులునుగాని, సాంబ్రాణినిగాని వెలిగించుచుండుము. రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు, యొగవాసిష్ఠము మొదలగు పవిత్ర గ్రంధములను ప్రతిరోజు చదువుకొనుటకు ఆ గదిలో వుంచుము. నాలుగు మడతలు వేసిన దుప్పటిని పరచి, దానిపైన మెత్తగావుండు తెల్లగుడ్డను వకదానిని పరచుము. దానిపై నీవు కూర్చొనుము. వీలైనచో దర్భాసనముగాని, పులి లేక జింకచర్మమునుగాని ఆ దుప్పటిపై పరచి దానిపైన కూర్చొనుము. వీలైనయెడల సిమెంటుతో ఒక అరుగును కట్టించుకొని దానిపైన, నీ ఆసనమును పరుపవచ్చును. ఇటుల చేయుటచే నేలపై పాకెడి చీమలు మొదలగువాని బాధవుండదు. ఆసనములో కూర్చొన్నప్పుడు, తల, మెడ, మొండెములను నిలువుగ వుంచుము. ఇటుల చేయుటవలన వెన్నెముక య్ందలి వీణాదండము శ్రమలేనిదిగ వుండును.

ఐదు ప్రధాన విషయములు

ప్రాణాయామము చేయుటకు ఈ ఐదు విషయములను గురించి శ్రద్ధ వహించవలెను. 1. శుభ్రమైన స్థలము 2. తగిన సమయము 3. మితమై బలవర్థకమై సులభముగ జీర్ణమగు ఆహారము 4. ఓర్పు, పట్టుదల, శ్రద్ధలతో కూడియుండి ఆనందముతో అభ్యాసము చేయుట 5. నాడీశుద్ధి, నాడీశుద్ధి కాగానే సాధకుడు యోగసాధనయొక్క 'ఆరంభ' స్థితినిచేరును. ప్రాణాయామమును చేయువాడు మంచి ఆకలి, చక్కని జఠరాగ్ని