పుట:Pranayamamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగములుగ జేసి, కుడినుండి ఎడమకు, ఎడమనుండి కుడివైపుకు త్రిప్పుము. ఇది మలబద్ధమును పారద్రోలి, జఠరాగ్నిని పెంపొందింప జేసి, మూత్రాశయ వ్యాధులను అన్నింటిని తొలగించును.

కపాలభాతి

కమ్మరవాని కొలిమి తిత్తులవలె త్వరత్వరగ రేచకమును పూరకమును చేయుము. ఇది అన్నివిధములగు శ్లేష్మవ్యాధులను పోగొట్టును. దీనిని గురించిన పూర్తి వివరములు మరొకచోట యివ్వబడినవి.

____...____

రెండవ ప్రకరణము

ధ్యానము చేయు గది

ధ్యానము చేసికొనుటకు ప్రత్యేకముగ ఒక గదిని ఏర్పరుచుకొని, దానికి తాళమువేసి వుంచుము. ఇతరులను ఎవరినీ దానిలోనికి రానివ్వకుము. దానిని చాల పవిత్రముగ వుంచుము. నీకు ప్రత్యేకముగ గదిని ఏర్పాటు చేసికొనుటకు వీలులేనిచో, నీ యింటియందు ప్రశాంతముగ వుండుగదిలో ఒక భాగమును యిందుకొరకు ప్రత్యేకించి వుంచుకొనుము. ఆ ప్రత్యేకించు కొన్న భాగమును మరుగుగా వుండుటకు ఏదైన తెరనుగాని, తడికనుగాని అడ్డముగ వుండులాగున పెట్టుకొనుము. నీవు కూర్చొను ఆసనమునకు ముందుగా నీ గురువు లేక యిష్టదేవత