పుట:Pranayamamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాధులను పోగొట్టును. కాని, యిది జలవస్తితో సమానమగు లాభకారి కాదు.

నేతి

ముళ్ళు ఏమియూ లేనట్టి 1/2 మూరెడు పొడవుగల సన్నని దారమును తీసికొనుము. దానిని మెల్ల మెల్లగా ముక్కులలో నుంచి లోపలికి పోవులాగున దూర్చి, నోటిలో నుంచి బయటకులాగుము. దీనిని ఒక ముక్కులో నుంచి దూర్చి, మరివక ముక్కులో నుంచి లాగి కూడ చేయవచ్చును. ఇది కపాలమును శుభ్రపరచి, చక్కని దృష్టిని కలిగియుండు లాగున చేయును. ఈ క్రియవల్ల పడిశెము, పీనసలు నివారణయగును.

త్రాటకము

రెప్పవాల్చ కుండ ఏకాగ్రతగల మనస్సుతో కండ్ల నుండి నీరుకారు నంత వరకు, ఏదైన చిన్ని వస్తువుపై దృష్టి నిలపి చూడుము. ఇందువలన అన్నిరకములగు కంటివ్యాధులు పోవును. మనస్సుకు గల చంచలత్వము పోవును. శాంభవీ సిద్ధి ప్రాప్తించును. ఇచ్ఛాశక్తి వృద్ధి అగును. దివ్యదృష్టి లభించును.

నౌలి

ఋజు స్నాయువుల సహాయముతో పొత్తి కడుపును గిరగిర త్రిప్పుటను నౌలి క్రియ యందురు. తలను క్రిందికి వంచుము. ఋజు స్నాయువు (RECTUS MUSCLE) ను రెండు