పుట:Pranayamamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుట మంచిది. ఒకనీటి తొట్టిలో బొడ్డువరకు నీటిలో ముణుగులాగునకూర్చొనుము. శరీరము యొక్క బరువు అంతయు కాలివ్రేళ్ళ యొక్కముందు భాగముపైనిలచు లాగునను, మడమలు పిఱ్ఱలను ఒత్తిపట్టి యుండులాగును ఉత్కటాసనములో కూర్చొనుము. 6 వ్రేళ్ళ అడ్డచుట్టు కొలతయు, 4 వేళ్ళ (బెత్తడు) పొడగున గల, చిన్న వెదురు గొట్టమును తీసికొనుము. దానికి VASELINE వాజులైను లేక సబ్బులేక ఆముదమును రాచి నునుపుగా వుండు లాగున చేసి గుదములో దూర్చుము. తరువాత గుదముతో దానిని బిగియ బట్టుము. ఆపిమ్మట నెమ్మదిగా ప్రేవులలోనికి నీటిని లాగుము. ప్రేవులలో, యీలోపలికి తీసికొనిన నీటిని కలియ బెట్టుము. ఆ పిదప ప్రేవులలోనికి తీసికొనిన నీటిని బయటకు వదలుము. దీనిని జలవస్తి అందురు. ఇది ప్లీహ, మూత్ర సంబంధమైన, గుల్మము, స్నాయు సంబంధమైన వ్యాధులను, జలోదరము, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు, ప్రేవులకు సంబంధించిన వ్యాధులు, పైత్య శ్లేష్మ వ్యాధులను నివారించును. ఈక్రియను పొట్ట ఖాళీగా వున్నప్పుడు ప్రొద్దుటి సమయమున చేయవలెను. ఈ క్రియ అయిన వెంటనే ఒక గ్లాసెడు పాలుగాని; అన్నముగాని తినుము. ఈ క్రియను నదిలో నిలువబడి కూడ చేయవచ్చును.

నీటి సహాయము లేకుండా వస్తి క్రియను చేయుటకు మరొక మార్గముగలదు. దీనిని స్థలవస్తి అందురు. నేలపైన పశ్చిమోత్తా నాసనములో కూర్చొనుము. పొత్తికడుపు, మూత్రాశయ భాగములను గిరగిర త్రిప్పుము. ఇది మలబద్ధమును పోగొట్టుటే గాక పొత్తికడుపుకు సంబంధించిన అన్ని