పుట:Pranayamamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 వస్తి 3 నేతి 4 త్రాటకము 5 నౌలి 6 కపాల భాతి, అను ఈ ఆరింటిని షట్‌క్రియలు అందురు.

ధౌతి

బెత్తెడు వెడల్పు, 15 అడుగుల పొడవుగల సన్నని పరిశుభ్రమైన గుడ్డపీలికను తీసికొనుము. గోరువెచ్చని నీటిలో దానిని ముంచుము. ఈ గుడ్డయొక్క అంచులను ఏమాత్రపు నూలుపోగుకూడ యివతలికి లేకుండులాగున జాగ్రత్తగ కుట్టించుము. ఆ పిమ్మట ఆ గుడ్డ పీలికను లోపలికి మ్రింగి, తరువాత బయటకు లాగుము. మొదటిరోజున ఒక అడుగు పొడవుగల పీలికను లోపలికి మ్రింగుము; ఆ పిమ్మట ప్రతిరోజు కొంచెము కొంచెము ఎక్కువగ మ్రింగుచుండుము. దీనిని వస్త్రధౌతి అందురు. మొదట, రెండురోజులు కొద్దిగా డోకు వచ్చినట్లు వుండును. మూడవనాడు తగ్గిపోవును. ఈ అభ్యాసమువల్ల అన్ని విధములగు పొట్టకు సంబంధించిన జబ్బులు (మలబద్ధము మొ) త్రేయ్పలు, జ్వరము, నడుము శూల, ఉబ్బసము, ప్లీహ, కుష్ఠు, చర్మవ్యాధులు, కఫపైత్య వ్యాధులు నివారణమగును. దీనిని ప్రతినిత్యము చేయనక్కరలేదు. వారమునకు ఒకమారుగాని, పదిహేనురోజులకు ఒకమారుగాని చేయవచ్చును. ఈ గుడ్డను సబ్బుతో కడిగి ఎల్లప్పుడు పరిశుభ్రముగ వుంచుము. అభ్యాసము ముగిసిన తరువాత ఒక గ్లాసెడు పాలు త్రాగుము.

వస్తి

దీనిని వెదురుగొట్టము సహాయముతోగాని, అది లేకుండగాని చేయవచ్చును. కాని వెదురుగొట్టము సహాయముతో