పుట:Pranayamamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముక్కునుండి గాలి పీల్చి, లోపల ఆపగలిగినంత సేపు ఆపి, ఎడమ ముక్కుగుండా గాలిని విడువ వలెను. ఈ రీతిని గాలిని విడచిన ముక్కుతో గాలి పీల్చుచూ, పైన చెప్పిన విధముగా చేయుచూ, రావలెను. పైన చెప్పినరీతిని క్రమ ప్రకారము అభ్యసించినచో మూడు మాసములలో నాడీ శుద్ధి కలుగును. ఆ పిమ్మట 4 వారములు పాటు, రోజుకు 80 మారులు సూర్యోదయ మధ్యాహ్న సూర్యాస్తమయ అర్ధరాత్రి సమయములందు గాలిని కుంభించుటను క్రమ క్రమముగ అభ్యసించుచూ రావలెను. ఇటుల చేయుటవలన ప్రారంభదశలో శరీరమునకు చెమట పోవుటయు, మధ్యమ స్థితిలో శరీరకంపనమును, చివరస్థితిలో గాలిలో శరీరము తేలిపోవుటయు జరుగును. ఇవి పద్మాసనములో కూర్చొని గాలిని ఆపుటపై ఆధారపడి యుండును. చెమట పోసినప్పుడు, చెమటను శరీరమున కంతకును రుద్దవలెను. ఇటుల చేయుటచే శరీరమునకు కాంతి, దృడత్వములు ప్రాప్తించును. ప్రారంభస్థితిలో వున్న సాధకుడు పాలు నెయ్యితో కలసియున్న ఆహారమును గైకొనుట లాభకారి. ఈ ఆహారనియమమును పాటించిన వానికి శరీరదార్డ్యము లభించును. అంతేగాదు, శరీరమున మంటలు(తాపము) పుట్టవు. సింహములు, ఏనుగులు, పులులు లాటి భయంకర జంతువులను క్రమక్రమముగ మచ్చిక చేసికొన గలిగిన రీతిని, జాగ్రత్తతో క్రమక్రమముగ ప్రయత్నించినచో ఈ శ్వాసనుకూడ వశపరచుకొన గలము.

ప్రాణాయామాభ్యాసము వలన నాడీశుద్ధి, శరీరకాంతి, జఠరాగ్ని, చక్కని ఆరోగ్యము, ప్రాణనాదములను వినగలుగుట లభించును. క్రమప్రకారము సరిగా ప్రాణాయామాభ్యాసము చేయుటచే, నరములకూటములు పరిశుభ్రమైనవై, వాయువును