పుట:Pranayamamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేరి, శరీరమునందలి పనికిమాలిన పదార్థములను తీసికొని, మలిన రక్తనాళములగు సిరలగుండా తిరిగివచ్చును. ఈ ధమనులు హృదయమునుండి పరిశుద్ధమైన ప్రాణవాయుపూరిత రక్తమును గైకొని, శరీరమందలి వివిధభాగములకు పంపును. ఇక సిరలు, శరీరమందలి అన్ని భాగములనుండి అపరిశుద్ధ రక్తమును తీసుకొనును, ధమనులు, సిరలు చేయుపని ఇది. హృదయమునకు కుడివైపున గల అపరిశుద్ధ రక్తము వుండును. హృదయమునకు కుడివైపున గల ఈ అపరిశుద్ధ రక్తము పరిశుద్ధపరుపబడుటకై శ్వాసావయవములోనికి పోవును. అచ్చట, ఈ చెడురక్తము లక్షలకొలది శ్వాస గోళములకు పంచిపెట్టబడును. మనము పీల్చిన గాలియందలి ప్రాణవాయువు శ్వాసావయవములందలి పుప్పుసీయ కేశనాళికల సహాయమువల్ల, ఈ అపరిశుద్ధ రక్తమువద్దకు పోవును. ఈ కేశనాళికల ప్రాకారములు బహుసన్నగ జల్లెడవలె నుండును. అందువలన వీటిగుండా అతిత్వరగా రక్తము స్రవించును. ఈ కేశనాళికలగోడల ద్వారా ప్రాణవాయువు, ఆరక్తమును ముట్టడించును. అప్పు డొకవిధమగు భస్మ ప్రక్రియ జరుగును.

అప్పుడు ఈరక్తము ప్రాణవాయువును గైకొని శరీరమందలి అనేక భాగములందలి అపరిశుద్ధ రక్తము, విషపదార్థములవలనను తయారై నట్టి బొగ్గుపులుసు గాలిని విడచును. అప్పుడు, ఈ పరిశుద్ధరక్తము నాల్గు పుప్పుససిరల ద్వారా ఎడమ కర్ణికలోనికిన్నీ, అచ్చటినుండి ఎడమ జఠరిక నిలయములోనికిన్ని గొంపోవబడును. తరువాత, ఈ జఠరిక నిలయమునుండి ప్రధానధమని యగు బృహద్ధమనిలోనికి తోడె వేయబడును. ఈ బృహద్ధమనినుండి, తదితరధమనులన్నిటిలోనికి