పుట:Pranayamamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడునప్పుడు 1 అడుగు, తినునపుడు 15 అం; నిద్రించునపుడు 3 1/2 అం, సంభోగ సమయమున 27 అం., శరీర వ్యాయామములు చేయునపుడు యింతకంటె ఎక్కువగను వుండును. ఇట్లు బయటకు విడచు వాయు ప్రవాహముల దూరము (9 అం, నుండి) తగ్గించుచో ఆయువు వృద్ధియగుటయు, ఎక్కువ చేయుటచే ఆయువు తగ్గుటయు జరుగును.

ప్రాణమును కేంద్రీకరించుట

ప్రాణమును బయటనుండి లోపలికి పొట్టనిండు నంతవరకు పీల్చి, ఆ పిమ్మట ప్రాణమును మనస్సుతో గూర్చి బొడ్డుమధ్య గాని, నాసాగ్రముపైగాని, కాలి బొటనవ్రేళ్ళపై గాని కేంద్రీకరించుము (ఎల్ల సమయములందు లేక త్రిసంధ్యలందును), ఈ రీతిగ చేయుటచే యోగి సర్వవిధములగు వ్యాధులు, వేదనలనుండి విముక్తుడగును.ప్రాణమును నాసాగ్రముపై కేంద్రీకరించుటచే వాయు తత్త్వము వశపడుటయు, బొడ్డుమధ్యన కేంద్రీ కరించుటచే అన్నివ్యాధులు నివారణ అగుటయు, కాలి బొటన వేళ్ళపై కేంద్రీకరించుటచే శరీరము తేలికయగుటయు లభించ గలదు. నాలుకతో గాలిని పీల్చువాడు తన మనోవేదనలనుండి విముక్తిని పొంది, దాహములేని వాడుగా అగుటయే గాక అనేక విధములగు వ్యాధులనుండి విముక్తిని పొందును. రెండు సంధ్యల యందును, రాత్రియొక్క చివరి రెండు గంటలయందును, నోటితో గాలిని మూడు మాసములు వరకు పీల్చువానికి సరస్వతీదేవి వాక్కునందు ప్రత్యక్షమగును. అతడు మంచి పండితుడగును. పైరీతిని ఆరు మాసములు చేయువాడు వ్యాథులన్నిటి నుండి విముక్తుడగును.