పుట:Pranayamamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగత్ర్పళయ సమయమందీప్రాణము సూక్ష్మముగను, నిశ్చలముగను, అప్రత్యక్షముగను, అభేదముగను వుండును. ఆ పిమ్మట జగత్కంపనము వచ్చును. అప్పుడీ ప్రాణము కదలి, ఆకాశతత్త్వమును సహాయముగ తీసికొని, అనేకరకములగు రూపములను సృష్టించును. బ్రహ్మాండము, పిండము లనునవి ప్రాణశక్తి, ఆకాశముల కలయికయే.

పొగబండిని, పొగఓడను నడిపించునది, విమానమును ఎగురులాగున జేయునది, ఊపిరి విడుచుట తీయుటలను జేయించునది, ____ఇదంతయు ప్రాణమే,

నీకీ ఉదాహరణల వల్ల ప్రాణశక్తి యన ఏదో తెలిసినది గదా!

కావున నీవీశ్వాసను వశపరచు కొనుటవల్ల, శరీరములో జరుగు సమస్త కార్యములను వశపరచు కొన గలుగుదువు. ఇందువల్ల నీశరీరము, మనస్సు, ఆత్మలు కూడ అతి త్వరగ నీకు లోబడును. ఇట్టి ప్రాణాయా మాభ్యాసముచే, నీ పరిస్థితులు, నీ స్వభావమును లోబరచు కొనుటయేగాదు, నీవ్యక్తిగత ప్రాణ శక్తివల్ల విశ్వ ప్రాణశక్తిని గూడ లోబరచు కొని నీ యిష్టానుసారము నడిపించ గలుగుదువు.

ఇచ్ఛా శక్తిచే సంకల్పములను వశపరచుకొని, ఆ సంకల్పబలము వల్ల శ్వాసను యిష్టాను సారము నడప గలుగుటచే పొందెడుశక్తి, నీ ఆత్మోన్నతికి సాయపడును.

ఇంతేగాదు, ఈ శక్తి నీయందలి, యితరులయందలి కుదురని మొండివ్యాధులను నివారించుటకే గాదు, యింకెన్నో ఉపయోగకరములగు పనులు చేయుటకు పనికివచ్చును.