పుట:Pranayamamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారి, తలయందు గల సామాస్రారము వైపు ప్రవహించు చున్నటుల భావించుటే, ఊర్ధ్వ రేత ప్రాణాయామము.

ప్ర: ప్రాణాయామ సమయమున 1 : 4 : 2 నిష్పత్తిని పాటింప గోరుచో ఇష్ట దైవమును ధ్యానించ లేకుండా వున్నాను. ఇష్ట దైవముపై మనస్సు నిలిపిన పై నిష్పత్తిని పాటించ జాల కున్నాను. తమ సలహా ఏమి ?

జ: మొదట రెండు మూడు మాసములవరకు పై నిష్పత్తిని పాటించుటను అలవరచుకొనుము. ఇటుల చేయుటవల్ల నిష్పత్తిని పాటించుట అనునది అభ్యాస మగును. ఆ పిమ్మట యిష్టదేవతను ధ్యానించుటను అలవరచు కొనుము.

ప్ర: ఒకే ముక్కుతో పూరక రేచకములు చేయు మనుటలో గల భావమేమి ?

జ: ఇది శ్వాసను క్రమ పరచి, మనస్సును నిలుకడ గలదిగా చేయును. సుషుమ్నా నాడియందు ధ్యానము చేయుటకు అనుకూలముగ వుండులాగున, వాయు సంచారము జరుగు లాగున చేయును. శరీరమును ప్రశాంతముగ నుంచును.

ప్ర: కొందరు తలచు రీతిని ప్రాణాయామము అపాయ కారియా ?

జ: నీ యింగితజ్ఞానము నుపయోగించి, జాగ్రత్తగా చేసినచో ఏ అపాయమురాదు. అజాగ్రతగా చేసినచో ప్రతిదీ అపాయకారియే

ప్ర: నేను సాధనను సక్రమముగా చేయుచున్నాను. ఇంకనూ అప్పుడప్పుడు చురుకుచురుకుమని శరీరమున అనిపించు చున్నది. కారణమేమి ?

జ. ప్రాణాయామము, ధ్యానములను చేయుటచే జీవాణువులు, రక్తనాళములు మొదలగువానికి పున:ప్రాణ ప్రాప్తి