పుట:Pranayamamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేయుటవల్ల శరీరమనెడి యంత్రమునందలి అన్ని చక్రములు ఆగిపోవును. ఈరీతిని శరీరయంత్రమును, ప్రాణమును వశపరచు కొనుటవల్ల లోబరుచుకొనుటనే ప్రాణాయామ మందురు.

కంసాలి, పుటము పెట్టుటచే బంగారమందలి మలినమును పోద్రోలినటుల, ప్రాణాయామసాధనచే యోగి తనయందలి అపరి శుద్ధతలను పారదోలును.

ప్రాణమును అపానముతో కలిపి, ఈ రెంటిని తలవైపుకు ప్రవహించునటుల చేయుటయే ప్రాణాయామము యొక్క ప్రధానాశయము, ఇందువలన నిద్రించుచున్న కుండలినీ శక్తి మేల్కొనును.

ప్రాణమననేమి ?

శ్రుతులు "ప్రాణమునుగురించి ఎవ డెరుగునో వాడే వేదములను తెలిసికొన్నవాడు" అని చెప్పుచున్నవి. 'అందువలన శ్వాస బ్రహ్మ' యని వేదాంతసూత్రములు వాకొను చున్నవి. జగత్తునందు గల సమస్త శక్తులయొక్క సమ్మేళనమే ప్రాణము - ప్రతి మనుష్యునియందు అతని చుట్టుప్రక్కల దాగియున్న సమస్తశక్తులయొక్క కూడికయే ప్రాణశక్తి. ఈప్రాణ శక్తినుండియే, వేడి, వెలుతురు, ఆకర్షణశక్తి, విద్యుచ్ఛక్తులు బయలు వెడలినవి. ఇట్టి సమస్తవిధములగు శక్తులు, మహిమలు, ప్రాణము-ఇవన్నియు, ఇకే ఆత్మనుండి వచ్చుచున్నవి. శారీరక మానసిక శక్తులన్నియు ప్రాణశక్తిక్రిందికివచ్చును. ప్రపంచములో చలనము, జీవము, కార్యచరణచేయు ప్రతిపదార్థము ప్రాణ శక్తియొక్క స్వరూపమే. ఆకాశముకూడ ప్రాణశక్తియొక్క