పుట:Pranayamamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలు, వెన్న మొదలగు విలువగల పదార్థములను మన కిచ్చుచుండెడి ఆవు, మేకలను చంపుట మహాపాపము కాదా! ఓపాపీ ? ఇట్టి నోరు లేని జంతువులను చంపకుము, నీకు గొప్ప శిక్ష విధింపబడును. నీవు చేయు ప్రతిపనికి నైతికముగ నీవే బాధ్యుడవు. గోవధ మాతృవధతో సమానమైన పాపకారి. నీకు పాలిచ్చి, నీ శరీరమును పోషించు వీటిని చంపుటకు నీకేమి హక్కు గలదు ? ఇది మూర్ఖమైన, అమానుషమైన, హృదయ విదారకమైన కృత్యము. ఈ పశువధ వెంటనే ఆపుజేయ బడవలెను. ఈ హత్య చేయబడు జంతువు హత్యా సమయమున భయము, కోపముగలదిగా వుండుటచే దాని రక్తమున అనేక విషక్రిములు జన్మించును. అట్టి మాంసమును తినుటవలన, మనకు అనేక వ్యాధులు వచ్చును. కావున శాకాహారివిగమ్ము.

ఆహారము విటమిను లను ప్రాణపోషక పదార్థము గలదిగా వుండవలెను. ఇందువలన శరీరము పెరుగును. ఇది లేనిచో శరీరము పెరుగకపోవుటచే అస్థిమార్దవరోగము మొదలగునవి వచ్చును. ఇవి నాల్గువిధములు. ఏ,బి, సి, డీ అని. 'ఏ' విటమిను పాలయందుండును. 'బీ' విటమిను ముడిబియ్యము, టొమాటోపండు రసమునందుండును. 'బీ' విటమిను తక్కువైనవారికి నంజువ్యాధి వచ్చును. తెల్లబియ్యము తినువారికి కూడ యీ వ్యాధి రాగలదు. 'సీ' విటమిను కూరలు, ఫలములు, పచ్చి ఆకుకూర లం దుండును. ఇది వండుటవల్లను, కళాయిచేసినవాటిలో పెట్టుటచేతను చెడిపోవును. నావికులు యీ పదార్థములను పొందుట కష్టముగాన శీతాదము అను వ్యాధిచే బాధపడుచుందురు. వారు నిమ్మరసమును తరచుగా తీసికొనిపోవుచుందురు. ఈ రసము త్రాగుటచే శీతాదవ్యాధి