పుట:Pranayamamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమలవలెను. ఇటుల చేయక పోయినచో సరిగా జీర్ణముకాక, వ్యర్థముగా మలరూపమున పోవును.

ఆహారమనునది శరీరపోషకముగను, ఆరోగ్యవర్ధకముగను వుండవలెను. మనిషి జీవించుటకు కావలసినది సరియైన ఆహారమే. చాలావ్యాధులు చెడ్డఆహారమును తీసికొనుటవల్లనే వచ్చుచున్నవి. ఆరోగ్యవంతుడుగా వుండదలచువాడు ఆహార పదార్థములను గురించి పూర్తియగు జ్ఞానమును కలిగియుండవలెను. మనకు కావలసినది విలువగల ఆహారముగాదు. సక్రమమైన ఆహారమే. విలువగల ఆహారము అనారోగ్యమును కలిగించును. సక్రమమైన ఆహారము ఆరోగ్యమును కాపాడును.

శరీరమునకు కావలసిన వేడినిచ్చుటకు, క్రొత్త జీవాణువులను సృష్టించుటకు ఈ రెండింటికిగాను మనము ఆహారమును తీసికొనవలెను. ఈ ఆహారపదార్థములలో మాంసకృత్తులు, పిండి పదార్థములు, ఉదజకర్భనము, స్ఫురితములు, లవణములు, వివిధములగు భస్మములు, జలములు, విటమినులు మొదలగునవి వుండును. మాంసకృత్తులుండు పదార్థములు నత్రజని సంబంధమైనవిగా వుండి, శరీరమందలి నాళనిర్మాణ మొనర్చును. ఇవి పాలు, పప్పు మొదలగువానిలో గలవు. వీనిలో కొన్నింట కర్బనము, ఉదజని, ఆమ్లజని నత్రజనియున్నూ, ఒక్కొక్కప్పుడు ఇనుము, గంధకము, భాస్వరము గలవిగను వుండును. పిండిపదార్థములు కర్బనోజ్జనితములు. ఇది బియ్యములో గలదు. ఇది శరీరమునకు పుష్టి లేక ఉష్ణము నిచ్చును. కర్బనోజ్జనితములో పిండిపదార్థము, పంచదార లేక జిగురువుండును. వీటియందు కర్బనము, ఉదజని, ఆమ్లజను లుండును. ఉదజకర్బసము లేక క్రొవ్వు నెయ్యి, వనస్పతి నూనె అందుండును. శరీర యంత్రమునకు తారు వేయుటకు నూనె పదా