పుట:Pranayamamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ జ్ఞానోదయమున్నూ, అందువల్ల సమస్త బంధములు త్రెంచివేయ బడినవాడున్నూ అగును" అని చెప్పబడి యున్నది.

ఆహారము మూడు విధములు: సాత్విక, రాజసిక, తామసికములని. పాలు, ఫలములు ధ్యానము, వెన్న జున్ను, బంగాళదుంప, Spinach మొదలగునవి సాత్వికములు. వీటి వలన మనస్సు సాత్వికమైనదిగ మారును. చేపలు, కోడిగ్రుడ్డు, మాంసము మొదలగునవి రాజసికములు. కామోద్రేకమును కలిగించును. గో మాంసము, ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తామసికములు. అవి మనస్సుకు జడత్వమును కలిగించి క్రోధము గలవానినిగ చేయును. దీనినే గీతలో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు యీ రీతిని చెప్పెను. "ఆహారము మూడువిధములు. ఆయుర్వృద్ధిని గలిగించుచూ, చిత్తస్థైర్యమును కలిగించి, బలమును ఆరోగ్యమును యిచ్చి, ఇహ పర సుఖముల యందు ప్రీతిని గలిగించుచూ రుచిగాను, మృదువుగాను స్థిరముగాను మనోహరముగాను వుండునట్టి పదార్థములు సాత్త్వికములు. చేదు, పులుసు, ఉప్పు, వేడి, తీక్షణము, మోటు,దాహమును గలవి రాజసికములు. నిలువ పదార్థములు, రుచిలేనివి, దుర్గంధము గలవి, గురువుగాక తదితరుల యుచ్ఛిషము, మద్యమాంసములు మొదలగునవి తామసికములు."

(గీత 17 అ. 8-10 శ్లో)

ఆహారము నాల్గు విధములు. త్రాగెడి ద్రవపదార్థములు, నమలవలసిన ఘనపదార్థములు, నాకి చప్పరించవలసినవి, నమలకుండా మ్రింగెడివి. ఆహార పదార్థములను నోటితో చక్కగా