పుట:Pranayamamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి నిలువచేయబడియున్న శుక్రము, కామోద్రేకము కలిగినప్పుడు Ejaculatory ducts అనబడు చిన్నగొట్టముల ద్వారా మూత్రద్వారము నందలి Prostatic Portion లోనికి నెట్టి వేయబడును. అచ్చట యీ శుక్రము Prostate Gland నందు కూడ బెట్టబడియున్న Prostatic Juice అనబడు ద్రవముతో కలియును. ఈ ఆంతరిక పరికరమును నిజముగా నడుపువాడెవడు ? దీనినంతను ఆలోచించినచో నీకు ఆశ్చర్యము వేయదా ? వివిధ విధములగు అసంఖ్యాకములగు యీ యంత్రములన్నియు ఎంతప్రశాంతముగను, త్వరగను తమ కార్యములను నెరవేర్చుచున్నవో గమనించితివా ? రక్తమును శరీరమున కంతకు పంపు వాడెవడు ? పరిశుద్ధ పరచు వాడెవడు ? ఆహారమును జీర్ణముచేసి, శరీరమునకు పుష్టినిచ్చి, పనికిమాలిన పదార్థములను బయటకు నెట్టివేయు వాడెవడు ? ఆతడే భగవంతుడు ! ఈ తొమ్మిదిదారులుగల శరీర మను పట్టణమందుండి పాలించు వాడతడే ?

యోగుల ఆహారము

మనస్సుకు శరీరమునకు సన్నిహిత సంబంధము కలదు. మనస్సనునది ఆహారముయొక్క అతి సూక్ష్మ భాగముచే నిర్మింపబడును. దీనిని గురించి ఉద్దాలకుడు తన కుమారుడగు శ్వేతకేతువునకు యీ రీతిని చెప్పెను. "ఆహారము మూడు విధములుగ మారును. స్థూల భాగము (Excreta) గను, మాధ్యమిక భాగము చర్మముగను, అతిసూక్ష్మభాగము మనస్సు గను మారును" ఇదేవిషయమును గురించి మరల ఛాందోగ్యోషత్తులో "ఆహారపారిశుధ్యము గలిగి యండుటచే పవిత్రా చరణ గలవాడుగా నగును. ఇట్టి పవిత్రా చరణ స్వభావముచే