పుట:Pranayamamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణాయామము

1వ ప్రకరణము


ప్రాణము, ప్రాణాయామము

ప్రాణాయామ మొక పూర్ణమైన శాస్త్రము. ఇది అష్టాంగయోగమందలి నాల్గవాంగము. 'తస్మిన్ సతిశ్వాస ప్రశ్వాసయో ర్గతివిచ్ఛేద: ప్రాణాయామ:' - పాతంజల యోగ సూత్రము (2.49)లలో ఆసన సిద్ధిపొంది శ్వాసోచ్ఛ్వాసలను వశపరచుకొనుటయే, ప్రాణాయామమని వివరింపబడినది.

'శ్వాస' యన లోపలికి పీల్చుగాలి; 'ప్రశ్వాస' యన బయటకు గాలివిడచుట, శ్వాస విద్యుచ్ఛక్తివలె స్థూలరూపమును ధరించిన ప్రాణశక్తి, శ్వాసస్థూలము; ప్రాణము సూక్ష్మము. అభ్యాసముచే ఈ శ్వాసను వశపరచుకొనినవానికి ప్రాణ శక్తి సహజముగ వశపడును. ప్రాణశక్తి వశపడుటచే మనస్సు వశపడును. మనస్సు ప్రాణశక్తి సహాయములేనిదే ఏ పనిని చేయజాలదు. మనస్సునందు ప్రాణశక్తియొక్క కంపనములవల్ల మాత్రమే సంకల్పములు మొలకెత్తగలవు. మనస్సు ప్రాణశక్తి యొక్క సహాయమువల్ల మాత్రమే కదలగలదు. ప్రాణమనునది మనస్సుకు బయటితొడుగు. 'శ్వాస' యనునది యంత్రము యొక్క ప్రధానచక్రము (FLY -WHEEL) లాటిది. ఇది ఆగుటచే తక్కిన చక్రములనియు ఆగిపోవునటుల, శ్వాసను ఆపి