పుట:Pranayamamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరికొన్ని రకములైన లవణములు కూడగలవు. వివిధములగు ద్రవములు కూడ గలవు. లాలాజలము నోటియందు, జఠర రసము పొట్టయందు, పైత్యరసము, మధురరసము, ఆంత్రరసము లనునవి ప్రేవులయందుండి ఆహార పదార్హములు జీర్ణకోశములోనికి పోవునప్పుడు ఆహారపదార్థములపై పని చేయుచుండును. లాలాజలము పిండిపదార్థములను చక్కెరగామార్చును. ఆతరువాత యీ చక్కెరగా మార్చబడిన పదార్థము మధురసము, ఆంత్రరసములతో కలియును. పైత్యరసము క్రొవ్వు పదార్థములపై పనిచేయును. జఠర రసము, మధుర రసము మాంసకృతులపై పనిచేయును. ఈ రసము లన్నియు వివిధ ఆహార పదార్థములతో చేరి, వాటి నన్నిటిని అన్నరసముగా మార్చివేయును. ఈ అన్నరసము క్షీరవాహికల ద్వారా రక్తమున కలియును. హృదయమునకు కుడివైపున అపరిశుద్ధ రక్తము వుండును. ఈ అపరిశుద్ధరక్తము పరిశుద్ధ పరుపబడుటకు గాను శ్వాసాశయములకు పంపబడును. అచ్చట పరిశుద్ధ పరుపబడిన పిమ్మట, తిరిగి హృదయముయొక్క ఎడమ భాగమునకు వచ్చి, అచ్చటనుండి బృహద్ధమని ద్వారా శరీరమున కంతకును యీ పరిశుద్ధ రక్తము పంపబడును. ఈ పరిశుద్ధ రక్తము శరీరమందలి ప్రతిభాగమును తనతో నింపి, వాటికి జలము నిచ్చును. ఆపైన యీ మాళములందున్న అపరిశుద్ధ రక్తమును సిరలు, హృదయమునకు కుడివైపున వున్న మలిన రక్తాశయమునకు తీసికొని వచ్చుచుండును.

ఇటుల వుపయోగపడగా మిగిలిపోవు పనికి మాలిన పదార్థము పీదప్రేవులగుండా ఆరడుగుల పొడవుగల గుదనాళికలోనికి కొంపోబడును. అచ్చటినుండి ఉదయమున జరుగుచుండు మలవిసర్జనము ద్వారా బయటకు నెట్టి వేయబడును.