పుట:Pranayamamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సక్రమముగ వున్నచో శరీరమంతయు సక్రమముగ వుండును. శరీరము నందలి అన్ని భాగములకు, యిచ్చటినుండియే శక్తి కిరణములు పంపబడును. ప్రాణాయామాభ్యాసముచే ప్రాణమును యీ నాడీ మండలిపై ధారణ చేయుటవల్ల, ఈ నాడీ మండలిలో అణగియున్న ప్రకాశము బయల్వెడలును.

సిద్ధాసనములో గాని పద్మాసనములోగాని నిలువుగ కూర్చొనుము. కనులు మూయుము.

నీవు సులువుగా పీల్చగలిగి నంతసేపు నెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. కుడిముక్కును కుడిబొటన వ్రేలితో మూయుము.. మానసికముగా 'ఓం'ను జపించుము. గాలిని కుంభించుము. ఈ సమయమున, నీమనస్సును సౌరనాడీ మండలిపై నిలుపుము. ఇటుల చేయుటలో మనస్సునకు అనవసరముగ ఏవిధమగు శ్రమయు కలుగ నివ్వకుము. నీవు కుంభకము చేసినప్పుడు, నీవు పీల్చిన ప్రాణవాయువు సౌరనాడీ మండలి (Solar Flexus) వద్ద చేరియున్నట్లుగా భావించుము. అప్పుడు మానసికముగ "నేను ప్రాణవాయువును, సౌఖ్యమును, ఆనందమును, బలమును, శక్తిని, పుష్టిని, ప్రేమను పీల్చుచున్నాను." అని భావించుము. తరువాత నెమ్మదిగా కుడి ముక్కుతో గాలిని విడువుము. ఆ పిమ్మట కుడిముక్కుతో గాలినిపీల్చి పై ప్రకారముచేసి, చివరకు ఎడమముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని ప్రతిరోజు ఉదయము 12 మారులు చేయుము. భయము, దుర్బలత, తదితరములైన కోరరాని ఆవేగములు, ఆధ్యాత్మికోన్నతికి భంగము కలిగించు తదితర దోషములు లేకుండపోవును. రానురాను మిక్కిలి ధైర్యశాలివై, ఆత్మజ్ఞానమును పొందగలవు.