పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేరక సిగ్గుతో చిదికి వదవదలాడుచుంటిని.శ్రీ పార్వతమ్మగా రందుకొనిరి.'ఇటు వినండీ!యూరపు దేశము వారి బ్రహ్మచర్యము మాట యెత్తకండి.ఆ బ్రహ్మ చర్యము మన వారి కెందుకు గాని,వీరిని బాగుగా ధనార్జనము చేసిన తర్వాత,ఫ్రౌఢవయస్సు వచ్చిన తర్వాత పెండ్లాడు మను చుంటిరే!మన దేశపు సర్వైసశ్వర్యమును జుఱుకొనుచున్నారు గనుక యూరపు వారు ఏ విద్య చేతనైన నెంత ధనము నైన నార్జింపఁ గల్గుచున్నారు. కట్టుబట్టు, కుట్టుసూది కూడ వారే తయారు చేయుచు మన దేశమువారి కమ్ముచు ధన ప్రవాహము తమ దేశము మిఁ ద పాఱుచుండఁ బట్టి లోకో పకృతి చేయగల్గు చున్నారు. నిజమే! అంత ధన మార్జించుటకు మన దేశమువారికి సౌకర్యము లేవీ? ఫ్రౌఢవయస్సు వచ్చిన తర్వాత పెండ్లాడుట యూరపు వారికి చెల్లవచ్చును గాని మన వారికి చెల్ల నేరదు. ఆ దేశమున యేఁ బదియఱువది యేండ్ల వరుని బ్రహ్మచర్యమును, ముప్పది నలువది యేండ్ల వధువు కన్యాత్వమును మనకు విశ్వసింప రానివి. చల్లని యూరపు దేశములో నవి చెల్లు నేమో నే నెఱుఁగను. మన దేశమువారి కావయస్సు యించుమించుగా వార్ధక కాలము. ధనార్జనము చేయునే కాక! అప్పుడు వివాహా మాడుట మన దేశము వారికి గతజల సేతుబంధనమే!

మొన్న వింటిరి గదా! యధికవిద్యావతిని బెండ్లాడు భర్తల గోడును! హైదరాబాదులో నొక గొప్ప డాక్టరు విద్యావతిని బెండ్లాడి యామె తఱచుగా యూరపు మొదలగు