పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టెలస్కోవులో కేతువును గుర్తుపట్టు చుండగా వెలుఁ గు రేకలు చెలరేగి కానరానీయ వయ్యేను. మర్నాటి తెల్ల వారుజామున నిర్వురము లేచితిమి. జాగ్రత్తగా గుర్తించి నిన్నటి యాకాసపు పట్టు చూపఁ గా రామేశము గారు స్పష్టముగా చూచియప్పుడే దాని గూర్చి హిందూ పత్రికకు వ్రాసిరి. మర్నాడు వారికి కొన్ని టెలిగ్రాములు దాని యెఱుక కై వచ్చినవి.అటుఫై నల్గయిదు రోజులకుఁ గాబోలు నది యందఱ యెఱు కకు నందినది.

ఆ ధూమకేతువును దక్షిణహిందూ దేశమున ప్రజాసామాన్యమున తొలుత గుర్తించిన వాఁ డను నే నగుటలో మహాత్తరమయిన విశేషమేదో ఉండ బోలు నని నేనిటీవల విశ్వసించుచున్నాను. అందుకే దీని గూర్చి యించుకంత హెచ్చగా వ్రాసితిని. తత్ప్రయోజన మేదో ముందు తెలియఁ గలదు.

--- ---