పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుచుండెడివాఁ డను. ఎపిగ్రాఫియా ఇండికా, ఇండియ౯ ఆంటిక్వరీ, ఎపిగ్రాఫికల్ రిపోర్టులు మొదలగు చరిత్రధార గ్రంధము లెల్ల వారి దగ్గఱఁ గలవు. వాని నెల్లఁ జదువఁ దెచ్చుకొని చదువుచుండు వాఁ డను.

1910 వ సంవత్సరము. హలిస్ కామెట్టు వచ్చినప్పుడు- ఇంకా కొన్నాళ్ళ కది స్థూలదృష్టికి గోచరించుననఁ గాటేలస్కోపుతోను, బైనాక్యులర్ తోను తెల్లవారుజామున లేచి ఆకాశ భాగమున మే మిర్వురమును బరిశీలించుచుండువారము. ఆ ధూమ కేతువు తొలుత అరుణోదయ మగుచుండగా ఉదయారుణ కాంతులు క్రమ్ముకొనఁ గా కానరాక పోయెడిది. ఒకనాఁ డు బైనాక్యులర్ చేతనంచుకొని మేడ దిగి రోడ్డుమీ దికి పోయి పరిశీలింపఁ గా నా కది వెల్తురు చీపురుకట్టవలె గోచరిం చెను. పర్వేత్తుకొని (అంతలో అరుణద్యుతులు క్రమ్ముకొను నని) రామేశంగారికి చూప వచ్చితిని. ఆ ఆత్రపాటులో మేడ మెట్లు కొట్టుకొని మోఁ కాలి మిఁ ద చర్మము చిట్లి నెత్తురు కారుచుండెను. అది చూడక నేను కేతువు కనబడెనని స్పష్టముగా గోచరించుటకు టెలస్ కోపును సరిద్రిప్పు చుంటిని. నెత్తురు చూచి ఇదేమని రామేశంగా రడిగిరి. అప్పుడు దెబ్బగుర్తించితిని. అంతలోనే టేలస్కోపులో స్పష్టముగా కేతువును గుర్తించితిని. రామేశంగారు మాయు ద్వేగమును, రక్తస్రావ బాధను గూడ గుర్తింప మిని జూచి నివ్వెఱ చెందిరి. నివ్వెఱ కొంత ఉడిగి