పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధూమకేతు దర్శనము

మద్రాసులో మా బావగారు దరి రామేశంగారి దగ్గఱ గుమాస్తా శ్రీ కాజా వెంకటశేషయ్యగా రుండిరి. వారి యండతో నేను మద్రాసులో నేలకొంటిని, మద్రాసు చేరగానే నాకు శ్రీ పండిత గోపాలాచార్యులుగారు, శ్రీ పురాణం నాగభూషణము గారు మిత్రులయిరి. గోపాలాచార్యులుగారి ద్వారా నాకు శ్రీ పనప్పాకం అనంతాచార్యులుగారితోను, వారి కుమారులగు శ్రీనివాసా చార్యులుగారి తోను మైత్రి యేర్పడెను. మద్రాసు చేరగానే వెస్లి మిష౯ హైస్కూలులో తెలుఁ గు పండితుఁ డనుగా నేను గుదుర్కొంటిని. రెండేం డ్లక్కడ నుంటిని. ఆ నాళ్ళలో తఱచుగా ప్రాచ్యలిఖిత పుస్తకశాల కరుగుచు నక్కడి గ్రంధములు చదువుచునుంటిని.

శ్రీ వేపా రామేశముగారితో నేను దఱచుగా విద్యావినోద మనుభవించుచుండు వాఁడను. రామేశంగారు విద్యారాశి. గణిత ఖగోళ చరిత్రాది శాస్త్రములందు నిష్ణాతులు వారికడ ఖగోళశాస్త్ర రహస్యములెన్నో తెలిసినుచుండెడి వాఁ డను. వారికొక టెలస్కోపు కలదు. వారిధర్మ పత్ని యంతర్వత్నిగా నుండి పురుటికై పుట్టినింటికి వెళ్ళుచుండు సందర్భములలో నెలల తరబడి రాత్రులందు వారితో చాలసేపు నక్షత్ర గ్రహమండలములను బరిశీలించుచుండువాఁ డను. ఎన్నో ఖగోళశాస్త్ర రహస్యములు వా రెఱుఁగఁ జెప్పుచుండు వారు. నేర్చు