పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిట్టి గోష్టులకెన్నఁడు గాని పోరాదనిశపధము చేసికొంటిని. క్రీ. 1904 ప్రాంతములో మాట యిది. అటు తర్వాత నే నెన్నఁ డను వేస్యాభినయ దర్శనమునకుఁ బోయి నట్టెఱుక లేదు.

బందరులో చదువుకొనుచుండుకాలమున నేను శ్రీకొండవెంకటప్పయ్యపంతులుగారి యింటను, శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారి యింటను వసించుచుండువాఁడను. వారి కప్పుడు నాపైఁ జాలవాత్సల్యము. శ్రీ సూర్యనారాయణరావు గారు వారిజీవితా వసానముదాఁక నాయోగక్షేమములు కనిగొనుచుండువారు.వారి ప్రేరణమున నే నేను మద్రాసు చేరితిని. అప్పటికి నాకు పదునెనిమిదవ యేడు. వారు శ్రీ రెంటాల సుబ్బావారు గారికి నన్ను గూర్చి జాబు వ్రాసిరి.

--- ---