పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గులు పలువురు వచ్చుట జరగెను. ఉపనయనము జరిగిన తర్వాత కొన్నాళ్ళు నన్నక్కడ నిర్బంధించి వారు నిలుపు కొనిరి. సంస్కృత నాటక కధలు, కాదంబరీ కధ నన్ను మా మేనమామగారు వేశ్యాపరివారితు లయి చెప్పగోరు చుండిరి. నేనును చెప్పు చుంటిని. ఎన్నా ళ్ళక్క డుండుట? పదినాళ్ళయిన తర్వాత ఆ యూరనుండి మా యూరకి వచ్చి వేసితిని.

ఆ వేశ్యల శృంగారములు, ఆటపాటలు, నేను కధలు చెప్పుచున్నప్పుడు వారు నెఱ పిన సౌహార్ధము, వారిహాస్యగాడు, బ్రాహ్మణ వృద్ధుడు, మా మేనమామగారు నన్ను ప్రతి వత్సరము వేసగి సెలవులలో- శ్రీ వెంకటశాస్త్రిగారు బందరు విడిచి వెళ్లుదురుగాన- తమ యూరికి వచ్చి యుండుమని కోరుట నన్ను ముగ్ధుని జేసి వైచినవి. మా యూర విడిచి బందరు కేగి వారపు మెదుకులు తినుచు చదువుకొనుట వెగటు గొల్పసాగినది. ఇల్లు విడిచి పదునాఱుమైళ్ళు బందరు నడచి వెళ్ళుట యెప్పుడును పరిపాటియే యైనను నాకప్పుడది చాల బాధ గొల్పినది. ఒకటి రెండు ఫర్లాంగులు వెళ్ళుటే నాకు చాల కష్టమయ్యేను. అక్కడ నొక బురద కాల్వ దాటవలెను. వెనుకకు తిరిగి పోవుదునా యని తోఁ చెను. బట్టల సర్దు కొనుచు కొంచెము సేపు కూర్చుండియోచించితిని. ఎన్నో చీకాకులు రేగినవి. శ్రీ వీరేశలింగము పంతులుగారి ప్రహసనములు, ఉపన్యాసములు నంతకుముందు చదివి యుంటిని. వేశ్యల గూర్చి వారి వ్రాసిన వెల్ల తలఁపునఁ బాఱినవి. ఇక