పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యరచనలు, ఉపన్యాసవినోదములు,కవితాకల్పనములు,వాదప్రతివాదములు, అహంతలు, మమతలు బలసి ఆధ్యాత్మచింత యంతర్దాన మందిన దనవలెను. శ్రీ శాస్త్రిగారు మాయమర్మము నెఱుఁగని స్వచ్చ హృదయులు. బందరు రాక పూర్వము వారి తీరు' దేశాటనం పండితమిత్రతా చ' అన్న శ్లోకము చొప్పున చాతుర్యమూలములు గలదై వర్తిల్లినది. అప్పటి దేశాటన పండితమిత్రతా రాజసభా ప్రవేశాదులు వారు చెప్పును వచ్చును, మేము వినను వచ్చును, కాని పండిత మిత్రుతకుఁ దర్వాతిదయు, రాజసభాప్రదేశమునకుఁ బూర్వపు దియు నగు చాతుర్యమూలము వారు చాటు చేయక సవిస్తరముగాఁ జెప్పుచుండెడివారు. నేను సిగ్గునఁ జిదికి పోవుచుండెడి వాఁడను.

ఆ కాలముననే మా యన్నగారికి వివాహము జరిగినది. ఆ వివాహము జరపినవారు, నా పెద తండ్రిగారి బావమఱఁది, సంగీత సాహిత్య విద్యారసికులు , దివిసీమలోని చోడవర గ్రామమున నెలకొన్న వారు, శ్రీలంక నాగేశ్వర శాస్త్రిగారు. వారికి నా మిఁద చాల వాత్సల్యము. ఆయన విధురులు. సంతతి లేదు. విద్యావినోదులే కాక వేశ్యావినో దులును. మా యన్నగారి వివాహము తర్వాతఁ గోన్నాళ్ళ కొక పుత్రస్వీకారము కూడ వారు చేసికొనిరి. ఈ కుఱ్ఱవాని కుపనయనము చేసిరి. ఆ వివాహమునకు నుపనయన మునకును గొప్పగా బోగపు మేళములు ప్రాతస్సయంకాలము లందు, రాత్రులందుఁ గూడ జరుగసాగినవి. వానినిఁ జూచుట కుద్యో