పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకిపగ

పది పదుమూఁడేండ్ల వయసు వాఁ డను. అప్పటికి చల్లపల్లిలోఁ జదువుకొనుటకు వెళ్ళియుందు ననుకొందును. నాకు చింతచిగురు పప్పుకూర యన్నఁ బ్రియము. మా యింటి దొడ్డిలో నున్న చింత చెట్టు గుబురుగాఁ జిగిర్చి యగ్ని జ్వాలలు రేగుచున్నట్లు మిలమిల చిగుళ్ళతో మెఱయూ చుండెను.' ఆ చిగురు కోసి తెత్తును, కూర వండి పెట్టు' మని మాయమ్మగారిని కోరితిని. గోడమీద నెక్కి చిగురు కోయుచు చేతి కందని కొమ్మ నొక కొంకికఱతో వంగ లాగఁ జొచ్చితిని. ఆ కొమ్మ ప్రక్కలఁ గాకిగూ డున్నది కాబోలును! నాకుఁ గానరాలేదు. ఒక కాకి యఱచుచు నినుపమేకుతోఁ గొట్టినట్టు కావు కావని యఱచుచు ఇంక నెన్నింటినో కాకుల రప్పించు కొనెను. ఒకటే గగ్లోలు! కంగారు పడి గోడ దిగి యింటిలోనికి వచ్చి వేసితిని. ఆ మర్నాడే నేను చల్లపల్లి వెళ్ళిపోయితిని.

తదాది నే నెప్పు డింటికి వచ్చినను నీకాకి పగ ప్రత్య క్షమయ్యెడిది. మఱచి దొడ్డిలోనికి వెళ్ళితినా కాకి ముక్కుతో నా తలమీదఁ గొట్టిన దన్నమాటే! భోజనము చేసి చేయి కడుగు కొనుచో నా నెత్తిమీద నా కాకి రెట్ట వేయుటయు ముక్కుతో పోడుచుటయు జరిగెడివి. కొన్ని సమయములో తల మీఁద యారోఁతకు మరల