పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చుచుఁ బరిపూర్ణతన జెందుటకుఁ గూడ నట్లే యేడు జన్మముల దాఁక సాగవచ్చును.

పరిపూర్ణత చెందు టనఁ గా మానవసామాన్యము కంటె నెంతో ఉన్నతోన్నతముగా ఎంతో లోతులోతుగా గోచరించిన తత్త్వమును మానవుఁడు తన ప్రేమ ప్రసరించిన చోట్ల నెల్ల వ్యాప్తపఱుపఁ గల్గుట. ఉన్నతోన్నతము, లోతులోతు నయినభావ మదాటుగా ఆకారణముగా అసాధనముగా గోచరింపదు. తన హృదయ మెంతెంత ప్రేమమయమగునో, ఆ ప్రేమ మానవత మీద నెంతెంత యధికాధికముగాఁ బ్రసరించునో మానవుఁ డంతంత ఉన్నతముగా అంతంత లోతుగా పారమ్యమునకుఁ జేరిక చేరికగాఁ బోగల్గును. చెట్లవ్రేళ్ళు విరివి సెంది దూరదూరము వ్యాపింపను వ్యాపింపను చెట్లు మీదికి పెరుగగల్గును. కూకటి వేరు నెలలోఁ తుకును జొరగల్గును గాదా!