పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురోహితత - సదనుష్ఠానము

పురోహిత వృత్తి నాకు మిక్కిలి రోత గొల్పినది. అది శాస్త్రగర్హిత మాన్నకారణమునఁ గాదు. ప్రాచీనధర్మశాస్త్ర ప్రకారము చూచినచో నేఁడు బ్రాహ్మణు లవంలంబించుచున్న వృత్తు లనేకములు శాస్త్రగర్హితములే! భృతకోపాధ్యాయత్వము, వైద్యము, గాయకత్వము, వడ్డివ్యాపారము మొదలయిన యింక నెన్నో యింతకంటే నీచము అగువృత్తులు ధనలభ్దికి బ్రాహ్మణులు చేయుచున్నారు. అయినను అవి నిందితములు గాకున్నవి. అట్టిచో నిక బ్రాహ్మణులే చేయవలసినవి పూజరితనము. పురోహితత గర్హితము లేలకావలెను? సంఘమున కావశ్యక మైనకులవృత్తి యేది గాని గర్హితము గారాదు. అయినను పూర్వులెల్లరు నవలంబిం చిన దైనను పురోహితత నాకు సమ్మతము కాలేదు. అది నేఁడు వట్టిబూటకముగా సాగుచున్నది. నూటఁ దొంబదిపాళ్ళు పురోహితులను గోరువారు వారియం దాదరము గౌరవము లేని వారు. ఏదో యలవాటున బాటించుచున్నా మన్న తృప్తికై కర్మలాచరించుచున్నారే కాని పరమార్ధబుద్ధితోఁగాదు.

ఆ యాచరించుకర్మలును ప్రయోజనమును, సన్నసన్న గాఁ గోల్పోవుచు వచ్చి యర్ధరహితములైన బాహ్యడంబరములుగాఁ బర్యవసించినవి. నిజముగా వాని