పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందఱు సగ మెఱుకతో నన్నింటిని బాటించు చున్నారు.

ఇటీవల జరగినవిషయ మొకటి.

నామిత్రున కొకనికి ముక్కులో పెద్దకురుపు లేచినది. ఆతని కాయుర్వేద వైద్యమునఁ గొంత నమ్మకము. మిత్రుఁ డొక ఆంగ్లవైద్యుడు దానికి ఆపరేషన్ చేసి సులువుగా దొలగింతు ననుంచెడెను. వ్యాధితుఁ డు పిరికి వాఁ డు. కూరగాయ దేశీయవైద్య మెఱిగినమిత్రుఁ డొకఁ డు నఖమును అనగా చేతిగోటిని నువ్వుల నూనెతో గాచి గోర్వెచ్చగా ముక్కలో రెండు బొట్లు వేసిన నది మాను ననెను. తోడనే ఆతని తల దన్నినమిత్రుడు ఇతరులగోటికంటే తనగోరు కత్తిరించి వేసికోనిననే మాఱీ మంచిదనెను. నాకు వెఱులు వేకులు నెత్తసాగినవి. ఇట్లంటిని.' అతఁ డాపన్నుఁ డు గానున్నాడు. ఆ శాస్త్రీయముగా నెఱుక లేని మొఱకు వైద్యములఁ జెప్పకుఁడు'.' నే నెందఱకో ఈ వైద్యముచే ముక్కులో కురుపులు మాన్పితిని. ఎఱుక లేని వైద్యము కాదిది' యని తొలియాతఁ డనెను. రెండవ యాతఁ ' డిది య శాస్త్రీయము గాదు. కొన్ని వ్యాధులకు తన శరీరములోని రక్తమునే ఒక చోటనుండి మఱొక చోట ఇంజెక్షన్ చేసి వ్యాధుల కుదుర్చుటను ఆంగ్లేయులు గుర్తించిరి కాదా! ఇది ఎంతో పూర్వమే మన వారు కనిపెట్టి సాగించిన విధానము. నేను నాకే కురుపు లేవగా నా చేతిగోరే వేసి కాచిన నూనెతో కురుపు మాన్పికొంటిని' అని నన్ను మాటాడకుండఁ జేసెను. నాలో ఇంతంతనరాని యశాంతి. ఇది చేసిన రోగి