పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిఘంటువులు ధర్మశాస్త్రాది గ్రంధ సంచయము నధికముగా నుండెను. గ్రంధములకై యనేకులు మా యింటికి వచ్చెడివారు. అర్ధ మయినంత వఱకు మా యింటఁ గల గ్రంధముల నెడ తెగక నేను చదువు చుండెడివాఁ డను. మా తండ్రిగారు తెలుఁగు మఱుఁగులు కొన్ని తెలియఁ జెప్పు చుండెడివారు. ఈ ముచ్చటలఁ బడి నేని ఇంగ్లీషుకు చదువు నిరాకరించితిని. సంస్కృతాంధ్రములగుచో స్వగ్రామముననే కొన్ని గంటలే చదువఁ డగుట, ఇంగ్లీషుకు తల్లిదండ్రులను, సుఖ భోజనమును విడిచి పెద్దయూరు బందరు పోవలయుట, పదొకొండు గంటలనుండి అయిదు గంటల దాఁక స్కూలుకు పోయి చదువవలయుట, ఊరిలోని మిత్రగోష్టిని విడువవలయుట దుఃఖకరములుగా నా కపుడు తోఁచినవి. నిర్బంధించి మా తల్లిదండ్రులు నన్ను గ్రామాంతరమునకుఁ బంపఁ జాలరైరి.పుత్రువాత్సల్యమును,భోజనాది సౌకర్యములు గ్రామంతరమున కల్గింపఁ గల ధనసంపత్తి లేమియు దానికిఁ గారణములు.

స్వగ్రామముననే బ్రహ్మణ్యులయిన మద్దూరి రామావ దానులుగారి దగ్గఱ సంస్కృతము, నింత తెలుఁ గు చదువ సాగితిని. పుణ్యమూర్తులు, ప్రాతస్స్మరాణీయులు మద్దూరి రామావధానులుగారు మా తండ్రిగారు నా బాల్య మిత్రులు. సమవయస్కులు. బ్రహ్మముహుర్తమున నిద్రలేచి సరిగా వేళకు సంధ్యా వంద నాగ్నిహోత్రాది ప్రాత రాహ్నికములు నిర్విర్తించుకొని ఒక గంట సేపు ఉంఛవృత్తి నెఱిపి, తొమ్మిది గంటలగుసరి కింటికి వచ్చి, మాధ్యాహ్నికము నిర్వర్తించు