పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాల్యస్మృతులు

ఒకనాఁడు తోడిబాలురుతో గోచికూడ లేక వీధిలో చింపిరి కాగితముల నేఱి యేదో పిచ్చి చదువు చదువుకొను చుండఁగా నన్నుఁ జూచి పుణ్యముర్తి కొట్టరువు సుందర రామయ్య పంతులుగారు (వారు మా యూర నేఁ బది యేండ్లకుఁ బైపడిన కాలము బడి పంతులుగా నెలకొని యూరి వారి కందఱకు ప్రాధమికఉదయ నేర్పిన సచ్చరిత్రులు.) నా చేయి పట్టుకొని ఇంటికి గొనివచ్చి మా మాతృ శ్రీ నడిగి గోచి గొని తానే మొలత్రాటికి దాని దగిలించి బడికి గొని పోయి రెండు మూడు నాళ్ళలోనే అక్షరజ్ఞాన మలవరిచిరి. తర్వాత వారిచేతనే మా తండ్రిగారు నా కక్షరాభ్యాసము జరపించిరి. నన్ను నే నెఱుగుటకు ఇది నా తొలిగుర్తు.

బడిలో నేదో చదువు సాగినది. అన్నింట నేనే మొన గాఁడను.లెక్కకు మాత్రము నిండుసున్న. తెలుఁ గన్న వెఱి తీపు. బడిలోని యుపాధ్యాయులు నాచే పద్యముల జదివించుచు సంతోషించుచుండెడివారు. సంగీతముతోడి చదువు నాఁటికి నేఁ టికిని గూడ నాకుఁ గొఱుకఁ బడని మెఱిక బియ్యమే! సంగీతము లేకున్నను సందర్భస్పూర్తి గలుగునట్లు పసినాట లెక్క కేక్కుడుగ పద్యములు నేను చదువఁ గల్గుట యుపాధ్యాయులకు ముచ్చట గొల్పెడిది. మా చుట్టుపట్టు గ్రామము లన్నింటి కంటె మా యూరనే మా యింటనే సంస్కృతాంధ్ర